1) నీవు లేక స్వప్నాలు ఆగిపొతున్నా మేఘాలు కదలనంటున్నాయి
ఈ మానసిక ప్రయాణంలో నిశబ్ద సమూహాల ఆత్మసంఘర్షణల మధ్య కన్నీటితో నేను
2) అంతులేని ఈ ప్రపంచంలో నీవాడిన చదరంలో పావునయ్యా
నా మనసుకి నీకూ మధ్య మారిపోయి భవిష్యత్ దృశ్యాల్లో అన్ని అవమానపు గాయాలే
3) నీ నాలుక మద్యి పగిలిన పదాల మద్యి ఊగిసలాడే హృదయం
ఏనిజాన్ని తెల్సుకోకుండా..నన్ను అవమానిస్తున్న స్నేహమా ఇలా ఎందుకు చేశావో చెప్పవా
4) పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది.
తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది అవమానించకు ప్లీజ్
5) మనిషిని గుండెలు పగిలేలా అవమానిస్తేనో...
కొట్టి చంపితేనో చచ్చిపోయేది కాదు ప్రేమంటే
6) నా ఆశనే శ్వాసగా పీలుస్తూ బరువెక్కిన గుండెలో
నీ జ్ఞాపకాలను మోస్తూ రావని తెల్సి కూడా నీకై ఎదురు చూస్తున్నాను ప్రియా
7) వెన్నెల మౌనమా కన్నుల్లో కన్నీళ్ళు ఎవరికోసమో
నీ కలల్ని తడిమాను ఒకప్పుడున్నా నీ కలల్లో.. ఇప్పుడు ఎంత వెతికినా కానరానెందుకో
8) మౌనమే నేను అడిగిన ప్రశ్నకు సమాదానం ఐతే దాన్ని భరించే శక్తి నాకు లేదు.చిరునవ్వే దానికి సమాదానం ఐతే దాన్ని పొందే అదృష్టం లేదని ఎప్పుడో తేల్చావుగా
9) భగ్గుమంటున్న ఒంటరితనపు సెగలు కాల్చకముందే నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ప్రియా
10) కమ్మిన మబ్బు గుండెలో వాన చినుకుల్లా
కంటి నిండ దాచలేని ఈ నీటి చుక్కలు అవుతున్నాయి
11) రోజులన్నీ గడిచిపోతూ కాలం నా దగ్గర నిలిచిపోయింది
పిచ్చిరాతలతో మరో పగలు కలిసిపోయింది రాత్రికోసం ఎదురు చూస్తూ
12) నీ నిశబ్దాన్ని పోగొట్టడానికే నేను నీకు వినిపించలేని శబ్దంలా మారాను.
13) ఒంటరిగా మిగిల్చిన క్షనంకన్నా
కత్తి మెలితిప్పుతూ పొడిచిన పోటు నీవు చేసిన అవమానమే
14) నిన్ను చూడాలి అని అనిపించని క్షణం ఉందంటే,
నువ్వు నా పక్కనైనా ఉండాలి లేదా నేనీ లోకం నుండి అదృస్యం అవ్వాలి
15) నాకు మాత్రం జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్తూంది నీ ఊహ
గడిచిన కాలాన్ని ఒక్కనిమిషం తెచ్చి ఇచ్చేయ్యావా.. ఇదే నా చివరికోరిక
16) నీవు నాలో ఉండి వెల్లిపోతున్నప్పుడు
మళ్ళీ నీపిలుపుకోసం కోసంపడే అరాటంలో ఎన్నిసార్లు మరణించానో ప్రియా
17) గతమంటే గడిచిపోయిన కాలమనుకున్నా.
కానీ ప్రస్తుతం ఊపిరి కూడా తీయ్యనియ్యని జాపకాలయ్యాయి
18) విరిసిన మధు మల్లెల సాక్షిగా..కురిసిన సిరి వెన్నెల సాక్షిగా
తడిపిన చిరు జల్లుల సాక్షిగా ..మెరిసిన నీ జ్ఞాపకాల సాక్షిగా నే నీకై వేచియున్నాను
19) కొన్ని జ్ఞాపకాలతో ఏంచేస్తున్నానో అర్దం కావడంలేదు
ఏడుస్తున్నానో..ఏడిపిస్తున్నావో వర్షాన్ని సింబాలిక్ చూపిస్తావేమో అనిపిస్తుంది ఇప్పుడు
20) బైట కురిసే జళ్ళుళ్ళో తడవాలని ఉన్నా
వెళ్ళలేని పెద్దరికాన్ని .. వర్షంనీళ్ళలో పారబోసి పరిగెట్టి పుల్ తడచాలని ఉంది
21) నీ కలల హద్ధులు దాటలేను నీ ఉహల కెరటాల తాకిడిని తట్టుకోలేను నీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేను ఊపిరి తీస్తున్నా తియ్యని అనుబూతులు మరువలేను
22) ప్రియా ఆగదు నీ జ్ఞాపకాల బాట లో నా పయనం
నా మాటలన్ని దోచుకొన్ని మూగన్ని చేసినా ఆపలేను నీ ఉసులు పలకడం
23) నువ్వు నాతో మాట్లాడతావని నా మాట మౌనమవుతోంది
నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమై మాటలు మౌనం దాల్చాఎందుకో
24) నీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడక
ఎప్పటికీ కపించవేమో అని నిరాశతో కన్నీరు కారుస్తోంది ఆవేదనతో
25) ప్రాణం పోవడం అంటే ఇదేనా నువ్వెళ్ళి పోతున్నావు నాతో లేవన్న నిజం తెల్సాక నన్నుకాదని మరొకరితో అన్ని అయి పోతున్నావన్న నిజాలు కొద్ది కొద్దిగా చంపేస్తున్నాయ్
26) లోతు తెలియని సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ప్రియా
27) ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే భూమిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కూర్చున్నా నన్ను తడిపేస్తావని నీప్రేమలో
28) మనసులో తళుక్కుమంటూ మురిపించి మైమరపించిన మాటలు
సంద్రపు హోరులో వెతుక్కోమంటూ అవమానించి మౌనం వహించి వింతలు చూస్తున్నాయి
29) నా చుట్టూ అందరూ ఉంటారు కానీ
ఏదో శూన్యం వేటాడుతుంది వేదిస్తుంది అదినీవేనా..?
30) నాలోకి నువ్వు బలవంతంగా చొప్పించిన భావోద్వేగాన్ని
నీ జ్ఞాపకాల చితి మంటల్లో కాలిపోయి నాకంటు ఎంమిగిలిందని ఏకాంతం తప్ప
31) మన మద్యి పెరిగిన ఈ దూరం కలచివేస్తుంది
నా కలం తోడు నిలిచింది బాధ ఎలా చెప్పాలో తెలీక మళ్ళీ పిచ్చి రాతలు మొదలు పెట్టాను
32) ముందుకొచ్చిన మౌనంతో కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్నివదలడమే సుఖమనిపిస్తుంది
33) నిశ్శబ్దం బద్దలయితే నీవిచ్చిన మౌనంలో
ఆ ముక్కలేరుకోవడమే ఒక్కోసారి సుకమనిపిస్తుంది...ప్రియా
34) జీవితపు తెల్ల డైరీలోని పేజీలు చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి ప్రియా
35) ప్రియా తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదు
36) ప్రేమ సాగరానికి దూరంగా అభిముఖంగా ప్రవహిస్తున్నా
ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై ఉనికిని ప్రశ్నిస్తే వెనుతిరిగా అప్పుడే తెలిసింది నువ్వు నాతొలేవు.
37) బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా
నీవు లేని నేను ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా ప్రియా
38) ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి
మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది నన్ను ఓడించాలంటూ
39) నువ్వు నాతో లేని క్షణం
నా నుంచి సంతోషం వేరవుతుంది నువ్వు దూరమైనంత తేలికగా
40) ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు ఒకేసారి బావుర్మన్నాయి
ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు ఆవిరయ్యాయి గుండెకు నీవు పెట్టిన జ్ఞాపకం సాక్షిగా
41) గుండె గాయాలకు కాగితాలద్ది ఆ రక్తపు మరకలని అందంగా..
కవితలగా మార్చాలని అనుకొంటున్నా కాని అక్షరాలు కన్నీళ్ళు కార్చి చెరిగిపోతున్నాయి
42) మనసు పగిలినప్పుడు ఆ నెర్రల్లో భావాలు ఇరుక్కున్నాయి
కళ్ళనిండా కన్నీరున్నప్పుడు వెతికినా కనిపించని వెన్నెల్లాగా ప్రియా
43) కనురెప్పలు మూయగానే కన్నుల్లో నిండుతున్న నీ రూపం
కనులు తెరవగానే కన్నీళ్ళుగా కారిపోతోంది గుండెతలపుల్లో దాగిన భావం ఇదేనా
44) అబద్దపు మమతలను ప్రోగు చేస్తున్నా గతం అంతా నిజమనుకొని
అదే భ్రమలో జీవిస్తూ ఇంకా ఇప్పటికీ.. ..ఏంటి నిజం కాదా మరి ఏది నిజం
45) ఇన్నాళ్ళూ ఒంటరితనానికి ఏకాంతానికి తేడా తెలీని అమాయకుడను నీవు దూరం అయ్యాక ఇప్పుడు ఒంటరితనంలో చేదును రుచి చూస్తున్నా ప్రియా
46) నాతో ఉన్నప్పుడు ఓ కన్నెపిల్లాలా స్నేహితుల్లతో ఉన్నప్పుడు ఓ కొంటెపిల్లలా మీ అమ్మా,నాన్నలతో ఉన్నప్పుడు ఓ చిన్నపిల్లలా మరిప్పుడు నాకు దూరంగా...?
47) నా అన్న నేను నీలో ఉండిపోయినప్పుడు
నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు ప్రియా
48) ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు చచ్చిపడిన శవల్లా
నన్ను కుడా శవంలా మార్చవా అందరిలా ... నీజ్ఞాపకాలు నిద్రపోనివ్వడంలేదు
49) నీవుకల వైనా బాగుండేది నిద్రలోనే జీవితం గడిపేవాడిని
గతంలా మళ్ళీమన స్నేహంగా ఉండటం సాద్యిం కాదా మిత్రమా..
50) రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం..లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన
మనసు మరణించింది ఏంచేయాలో తెలీక ప్రతిరాత్రి శవం లా జాగరణ చేస్తున్నా నీకోసం