. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 17, 2013

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...Part-5

కవిత్వం చదివి " ఆహా సూర్యాస్తమయం యెంత అందమైనది ! నేను చూడనే లేదే " అని ఒకడు సాయింత్ర్రం గోదావరి గట్టున కూర్చుంటే ఆ ఆనందం వొస్తుందా? ఆవడలో, ఇంటి తగాదాలో, సినిమా కథలో, ఏదో తలుచుకుంటూ కూచుంటాడు అంత సేపు...!


అట్లానే కొందరికి త్యాగం ఆనందమిస్తుంది -- కొన్ని పరిస్తుతులలో. కాని ప్రతి వుపన్యాసకుడు, గ్రంధకర్తా త్యాగం చెయ్యమనే వాడే -- కవిత్వానికని, సత్రానికని, కొడుకు పెళ్ళికని, దేశానికనీ, పత్రిక్కి చందా కని త్యాగం రాదు. ఏ స్వభావానికి ఏ త్యాగం ఆనందమిస్తుందో అదే అవసరం, ఆరోగ్యమూ... కొందరికి అసలు త్యాగమే పనికి రాదు. చాలా మంది త్యాగాలు ఏదుస్తూ చేస్తారు. మతము ధర్మము డ్యూటి అని పేర్లు పెట్టి త్యాగాలు చేస్తారు. సాధారణం గా తల్లులు భార్యలు చేసే త్యాగాలు ఇట్లాంటివే. ఎవరికే త్యాగం అవసరమో వళ్ళ ఆనందమే నిర్ణయించాలి. ఒక స్త్రీ తన భర్త ను వదిలి పిల్లలను వదిలి పనికిమాలిన ప్రియుడి వెంట వెళుతుంది. ఇంకో స్త్రీ పనికి మాలిన భర్త కోసం ప్రియుణ్ణీ లోకాన్నీ, పిల్లలనీ వదులుకుంటుంది. ఇంకో ఆమె బిడ్డ కోసం భర్త ని, సంఘాన్ని, నీతి ని వదులుతుంది.. వీటిల్లో సంఘానికి నచ్చినవి మెచ్చుకుంటారు. తక్కినవాటిని ఖండిస్తారు. కాని ఏది ధర్మమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే కాని మనుష్యులు కాని శాశ్త్రాలు కాని నిర్ణయించలేవు... ఎందుకంటే ఆనందమివ్వని ధర్మం నీ ధర్మం కాదు, ఇంకొకడిదీ,

దేశానికి ప్రతివాడు త్యాగం చెయ్యాలని అంటారు. అక్కర్లేదు అంటే తిడతారు. ఎవరి హృదయం దేశభక్తి తో పరవశమౌతుందో వాళ్ళు సర్వము త్యాగం చెయ్యనే చేస్తారు. ఇది మన ధర్మం కనక చేయాలి అనే ప్రసక్తే వుండదు... "ఇది నా ధర్మం" అనుకునేప్పటికే ఇతరులు విధించిన ధర్మమని వ్యక్తమవుతుంటుంది... అట్లా దేశభక్తి వల్ల అనందం రాని వాళ్ళు ధర్మమని కీర్తికని, పక్కవాడు చేసేడని, చాలామంది చేసేరు... త్వరలోనే చింతించారు... వారి స్వభావం ఆ త్యాగానికి తగినది కాదు గనుక.

సుఖము బాధ పరిస్తితులు తెచ్చి పెడుతు వుంటాయి, చాలా మంది ఏమి ఆలోచించకుండా అనుభవిస్తూ బతుకుతారు. తాము ఎంత వరకు ఆ బాధలకు కారణం, తప్పించుకోవటానికి తమ ప్రయత్నమెంతవరకు వుపయోగపడుతుందో, యోచించరు. కర్మ లోనూ, జ్యోతిష్కం లోను నమ్మకం ఈ నిద్ర కు తోడ్పడి, జోల పాడుతుంది. జీవితం లో సంతోషం లేనప్పుడు కొత్త సంతోషము కల్పించుకోగలం. బాధలు తటస్తించినప్పుడు నిగ్రహించుకోగలం. బాధను ఎదిరించి పోట్లాడితే చాలా వరకు లోబడుతుంది. కాని ఆ జ్ఞానము శక్తీ చాలా కొద్ది మందికే వున్నాయి.

లోకం సౌందర్యాన్ని కల్పిస్తుంది., కాని అనుభవించమని బలవంతపెట్టగలదా? అట్లానే జీవితం కష్టాలను కల్పిస్తుంది, కాని అనుభవించమని బలవంత పెట్టలేదు.

వెయ్యకు తొమ్మిదివందల తొంభైమందికి ప్రత్యేకం గా ఏదో అందరాని ఆనందాన్ని సాధించాలనే ఆర్జి వుండదు. ఇంకా మృగాల స్తితి లోనే వున్నారు. సుఖం గా తినటమూ, కనడమూ , చావడమూ , వాళ్ళు చేయవలసిందల్లా. అదే వాళ్ళ ఆనందము. కాని ఆ సంగతి గమనించరు. ఘన కార్యాలు చేసిన వాళ్ళ గురించి విని కని, చదివీ, తమకు లేని శక్తులు వున్నయనుకుని అనుసరించ పోతారు. ప్రయత్నించి విఫలులైన బోసులూ, శాండో లు, శుక మహర్షులు, రవీంద్రులు, I.C.S లు ఎందరో వున్నారు మన మధ్య. నరకం, స్వర్గం సంగతులు విని, భయపడి, ఆశపడి భక్తి ని, వైరాగ్యాన్ని, నటిస్తారు. దాని వల్ల రోగాలు బాధలు అప్పులు ఇన్ని పడతారు. ఎంత తన్నుకున్న శాస్త్రాలు ఎంత ఘోషించినా ఎన్ని తత్వాలు పాడినా అందరు విరాగులు కాదు, ధర్మాత్ములు కారు. ఆ పాడే వాళ్ళకు తెలుసు "అన్నళ్ళీ ముచ్చటలు - తనువులు శాశ్వతమా" అని పాడి విరక్తి పుట్టిస్తారు. కాని ఒక్క గుప్పెడు బియ్యం మీదో, ఒక్క కానీ మీదో మనకు విరక్తి కలిగితే చాలు ఆ పూటకి, వాడికి తృప్తి. తమ జీవితం లో ఆనందం ఎట్లా కలుగుతుందో తెలిసినా, ఆ ఆనందం కోసమే ప్రయత్నం చేసి ఆటంకాలను వదులుచుకునే వాళ్ళూ చాలా కొద్ది మంది. ప్రతి పని విషయమై కూడా 'ఇది నా ఆత్మ కు ఆరోగ్యమా కాదా? నాకు లభ్యమైన కాలాన్ని, శక్తి ని, ధనాన్ని ఆనంద రూపం గా మారుస్తున్నానా లేదా?' అని విమర్శించరు. మొహమాటం, ప్రతిష్టా, భేషజం, కపటమూ ఇన్నీ అడ్డం వస్తాయి.