. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 17, 2013

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...Part-2

ప్రతి వాళ్ళు బాధ నుంచి తప్పించుకుని ఆనందాన్ని పొందుదామని చూస్తారుగాని ఆ నేర్పు కలిగి ఆనందాన్ని పొందగలిగే వాళ్ళు కొద్దిమందే కనపడతారు. మన "ఇన్ స్టింక్ట్" ఆనందం కోసం బలీయం గా వుంది. తనకు బాధ కలిగించే పనుల నుంచి మన శరీరం తనంతట తానే తప్పుకుంటుంది. కాని మన మనసుకు మాత్రం ఇంకా ఆ "ఇన్ స్టింక్ట్" రాలేదు. జ్ఞానము , నేర్పు ఇంకా సంపాయించలేదు. ఏది తమకు ఆనందం ఇస్తుందో, బాధల నుంచి ఎట్లా తప్పుకోగలరో మనుష్యులు ఇంకా నేర్చుకోలేదు, కనుకనే ఎవడు వచ్చి "ఆనందం" అని కేకలు వేసినా వాడి వెంట పరుగెత్తుతారు.

ఆనందం విషయమై కొన్ని నిబంధనలు కనపడుతున్నాయి.
నాకు ఆనందం కావాలి, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే వొచ్చేట్లు కనపడదు. ఒక కార్యం ద్వారానే కలుగుతుంది ఆనందం. మనసు ఆ కార్యం మీద వుండాలికాని ఆనందం మీద వుంటే ఆనందం చెదిరిపోతుంది. తీపి కావలన్న వాడూ తీపి కోసం ఎక్కడన్నా వెతుకుతుందా? తీపి నివ్వగల చెరుకు కోసం వెతకాలి. అట్లానే ఆనందం కావాలిస్తే ఒంటరిగా కూచుని ఎవరికి లేకుండా కొంత ఆనందంసంపాయించుకోవాలంటే అది క్షుద్రరూపాల ప్రసన్న మవుతుంది. ఒక్క నిమిషము లో నశిస్తుంది. మనం జీవిస్తున్నాం, మనకు ఆనందం కావాలి అనే ధ్యాస లేకుండా జీవితాన్ని గొప్ప వుద్యమాల్లో, లోక క్షేమానికి ప్రపంచానందానికి చేసే ఘన ప్రయత్నాలలో ఐక్యమయ్యే మనిషి పొందే ఆనందాన్ని స్వార్ధపరులు పొందనట్లు తోస్తుంది. మొదటి రకపు ఆనందం స్వభావమే వుత్తమమైనది గా తోస్తుంది.. ఒక ఆనందమైన కధనుగాని, బొమ్మను గాని సృష్టించే ఆనందం తలుచుకోండి...

ఈ ఆనందం ఎవ్వరికి ఇవ్వను; నేనే దాచుకుంటాను అన్న నిమిషాన ఆ ఆనందం మాయ మౌతుంది . చెట్టునున్న పువ్వును జేబులో దాచుకున్నట్లు, ఎవరెత్తుకుపోతారో అని భార్యలను దాచుకునే వాళ్ళు, ఈ విషయమై కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.... చక్క గా యోచిస్తే ఇతరులనుంచి దాచుకున్నామన్న తృప్తి తప్ప ఏ మాత్రమూ వాళ్ళు ఆనందాన్ని పొందలేరు.

తనే ఆనందం పొందాలనే కార్యాలకన్నా ఇతరులకు ఆనందమిద్దామనే వూహ తో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. తిండి తినటానికి సంగీతం పాడటానికి భేదం ఆలోచించండి. అందువల్లనే ప్రేమ వలన వచ్చే ఆనందం అద్వితీయమైనది. ఎందుకంటే ప్రేమ వున్నప్పుడు తనకి ఎంత ఆనందం వస్తుందనే ధ్యాస వుండదు. ఎంతసేపు ఇతరులకు ఎంత ఆనందం ఇవ్వగలమనే యోచనే బలం గా వుంటుంది..

ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని ఆ కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి వుపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. ఆ శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి ఆ శక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. ఆ హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి ఆ అనందాన్ని పొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆ ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మ లూ వున్నాయి.