ఎన్ని ప్రశ్నలో పగిలిన జీవితంలో
వాన చినుకుల శబ్దంలో కలిసి
డ్రైనేజీలోకి జారిపోయిన నా జీవితం
ఏదో తెలియని భయం వెంటాడుతోంది
కన్నీరు కార్చడానికి కళ్ళు సహకరించడంలేదు
ఎవరికోసమో నీవు చేసిన అవమానాలు
నన్ను అనాధశవాన్ని చేశాయి
దిక్కులేని హృదయం గతంకావాలంటూ
రోదిస్తుంది.. ప్రస్తుతం జరిగే దారుణాలు చూడలేక
ఇంకా చావని ఆశతో
నీ ప్రేమ దొరుకుతుందేమో అని
పిచ్చి ఆశ చెట్టుతో గోడు చెప్పుకొంటూ
నీ ప్రేమ చెట్టు దగ్గరే ఆగిపోయి
హృదయానికి ,మనసుకి
కళ్ళు పోగొట్టుకొని
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న
తనను రోజూ రాలుతున్న ఆకులతో
పలకరిస్తూ వెర్రినవ్వులు నవ్వుతూ
ప్రేమ అనే బ్రమకల్పిచావు
దొంగ జాలి నటించావు
దొంగ ముద్దులు పెట్టావుప్రియా
అన్ని నటనే ఏదీ నిజంలేదు
నిజమైన ప్రేమ అనుకున్నా
అచ్చమైన నిజంలా
ఎంత తియ్యగా మాట్లాడావు
అచ్చమైన ప్రేమ ఎంతభాగా నటించావు
పిచ్చిమనస్సు అన్నీ నమ్మేసింది
నీ ప్రేమ నటన అని తెలీక
ఏమో ఇప్పటికీ
మనసు నిన్నే నమ్ముతొంది
నీది నటనే అని చెప్పినా వినడంలేదు
నిజాన్ని గొతంలో కుక్కి
కొత్త దారులు వెతుక్కొని నీవు హేపీగానే ఉన్నావు
కొత్త కొత్త స్నేహితులతో.. అసలేం జరగనట్టు
గతం ఏదీ జరగనట్టు నేనెవరో తెలీనట్టు
ఇలా మనసును ఏమార్చడం
నీహాబీనా ప్రియా..నీ కిదో రకం గేమా..
నా మనసుతో బలే గేం ఆడావు కదా ప్రియా
ఈ నా నిజమైన ప్రేమను చూసి
వెకిలి నవ్వులు నవ్వకండి
జాలి చూపే మనసు లేక పోయినా
పర్లేదుమాటల్ని ఖర్చు చేసుకోకుండా
పక్కగా వెళ్ళండి మళ్ళీ మీ సంస్కారం మైలపడొచ్చు