. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 15, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(12)

1) రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని అగాథపు లోతుల్లోకి కూరకపోతున్నాగా


2) చీకటి రాత్రి నా నరాలు చిట్లగొట్టుకొని రక్త చరిత్రలు రాస్తున్నారు.

3) చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...?
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటే...?


4) ఒంటరి మనసు పదే పదే ప్రశ్నిస్తోంది...
అన్ని వేల పరిచయాలు ఏర్పడినా...ఎందుకిలా మిగిలిపోయానని .


5) అదిగో ఆనందం నన్ను చూడు ఎలా చూస్తుందొ
ఏంటో నన్ను దోషిని చూసినట్టుకరిచేలా చూస్తుంది


6) నా మనసును కొస్తూ నీ జ్ణాపకాలు కత్తులుగామారాయెందుకు
నీ జ్ఞాపకాలకు నా పై పగ పెంచుకున్నాఎందుకో అర్దంకావడంలేదు
నీవు ఆజ్ఞాపకాలను నాగుండెల్లో గుచ్చెందుకు చుర కత్తులుగా మార్చావా


7) ఏంటీ తడి చుక్కలు నా బెడ్ మీద
కలలో కన్నీరై కంటినుడి కారిన కన్నీటి జ్ఞాపకలేనా ఇవి ..?


8) మాటలన్నీ ఖాళీ అయ్యాయి మనమద్యి ఎండిన నదిలా
గుండె బిగుసకపోయింది నీమాటల శబ్దాలు చేరలేక చిలుంపట్టిన రేకుడబ్బాలా


9) హృదయంతో రహస్యఒప్పందం చేసున్నావా
బయటపడకుండా నా భావాలని ఆపమని ఆ కనురెప్పలకి ఎంత లంచం ఇచ్చావ్


10) నా గుండె శబ్దాన్ని రాసిచ్చా
నా ప్రియ సఖి కి సొత్తుగా ఎప్పటికీతనతోనే ఉండిపొమ్మని


11) ఇక్కడే ఎక్కడో ఉన్నావు..చాలా చాలా దగ్గరగా ..
కొద్దిచేపు పెరిగి కొద్దిసేపు తగ్గే గుండెచప్పుడు నీ ఆచూకి దగ్గరగా ఉందని చెబుతోంది


12) ఒయ్ అదేంటి నీకళ్ళు ఎర్రగా వున్నాయి
నీ పెదాలు అలా కదులుతుంటే నాకళ్ళలో నీళ్ళు వస్తున్నాయేంటి


13) చుక్కలా మిల మిలా మెరుస్తూ నిన్నలరించాలని
వెన్నెల్లా నీకు వెలుగైతే..జాబిల్లిలా నన్ను చేరుకుంటావని తపిస్తున్నా ప్రియా


14) అక్షర సముద్రంలో నన్ను ముంచి అందులోనుంచి మంచి ముత్యాలనేరమంటావు
అందినట్టే అంది చిక్కకుండా చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ ఊరిస్తుంటావు ప్రియా


15) అక్షరాలు కత్తులు నువ్వు దూషించినప్పుడు
అక్షరాలు మధురమైన పువ్వులు నువ్వు నన్ను ప్రేమించినపుడు


16) నన్ను వదిలి వెల్లిన నిమిషాలన్నీ
చేజారిన క్షనాలను తోడుకొచ్చి మనసు పొరల్లోకి కిజారవిడిచాయి


17) నువ్వు ఉంటే ప్రతి రాత్రి వెన్నెల రాత్రే
నువ్వు లేని పగలైనా అమవాస్య చీకటే ప్రియా


18) నీ సంగత్యంలో బాధలన్నీ మరచి పొవాలనుకున్నా…
కానీ ఆ బాధకి కారణం నీవే ఐతే నేనెవరిని ఆశ్రయించాలి మరణాన్ని తప్ప …


19) తెలియకుండా వస్తూనే వెలతానన్న విశాదాన్ని తెస్తావు,
వెలుతూ వెలుతూ మళ్ళి ఎప్పటికో అన్న విరహాన్ని రగిలిస్తావు ఎందుకో.


20) నీలొ నన్ను వెతుక్కుంటు ఒంటరైన ఈ క్షణం
నాకై ఒక్క క్షణం కూడా వెచ్చించలేని నీ ప్రేమకు నేను పిపాసిని


21) మదినిండా విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని ఎప్పటిలానే..ఆకాశంవైపు ఆత్రంగా చూస్తున్నా "జాబిల్లి" కోసం


22) విరిగి చెదిరిన ఆశల తునకల మద్యి
జ్ఞాపకాలను ఏరి తిరిగి సమ కూర్చకోలేక ..


23) కాలం జీవితంలో కాల కూట విషం చిమ్ముతోంది.
మొత్తం దేహమంతా భుగ భుగలాడుతోంది..విషం యాసిడ్ లా కాల్చేస్తుంది ప్రియా


24) ఎన్నో దినాలు క్షానాలు వచ్చి వెళ్ళాయి
నేను మాత్రం నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోయాను..ఒంటరిగా మిగిలిపోయాను


25) నా భావల్ని నీకు వినిపించడానికి
మాటలెన్నో వెతుక్కుంటాను కానీ…ఏ పదాలు యదార్థాన్ని వివరించలేవు


26) వేకువకి వేకువకీ మధ్య ఎన్ని ఆశలో
అవన్నీ అనుభవంలోకి రాకుండానే గడుస్తోంది కాలం..నిశ్శబ్దంగా జారుకుంటోంది


27) బిడియపు తాళం పడిన నాలుక మౌనం దాల్చి
పోగేసుకొచ్చిన మాటలన్నీ తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోతున్నాయి ప్రియా


28) దిగులు కళ్ళతో..వెర్రి చూపులతో మరు పు మాటలతో,
అన్ని విశ్వాసాలు నశించి తోవ తెలియక తిరుగుతున్నా ప్రేమ బైరాగిలా


29) ఎలా చెప్పను అర్థం చెప్పుకోలేని అవ్యక్త భావంలా
ఈ సమయం నన్నేదో ప్రశ్నిస్తున్నాయి ఇవే రోజులు…ఇవే క్షణాలు…


30) రాత్రంతా కురిసే వర్షపుచ్ఛాయల్లా..
తనువంతా కురిసిన నీ అధరామృతపు చినుకులు నీ ఙ్ఞాపకాలు


31) ఇప్పుడు నా కళ్ళవెంట నీళ్ళు రావడం లేదు
అయినా నా హృదయం మాత్రం రోదిస్తూనే ఉంది నీకోసం
నా బదులు మబ్బులు వర్షిస్తున్నాయిగా కన్నీళ్ళను ఎకదాటిగాఈ రోజు


32) ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువున్నపుడు కాలాన్నీ..నువు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం


33) నాకెప్పటికీ అర్థం కాదు నీ ఙ్ఞాపకాలు
నా మనసునెందుకిలా బాధిస్తాయో నువు చెప్పవూ ప్లీజ్


34) ఒంటరిగా అంతులేని ప్రశ్నలతో రాత్రులు నిద్రలేకుండా నేను
ఇద్దరికీ మధ్య భౌతికంగా మాటల్లేకపోయినా మౌనంలో ఏన్ని మాటలు జారిపోతాయో


35) రాత్రంతా కురిస్తే పగలు మిగిలిన వర్షపుచినుకుల్లా
తనువంతా కురిసిన మధురమైన చినుకులు నీ ఙ్ఞాపకాలు.


36) నీ ఙ్ఞాపకాల పుటని తిరగేస్తే ఓ క్షణమేదో తలుక్కుమంటుంది
నీ జ్ఞాపకం ఆ క్షణమేనా హృదయంలో చిరునవ్వుని తొలగించి భాదలతో నింపేస్తుంది


37) నీవొక ప్రేమ జాబిలి.వెన్నెల సిరిమళ్ళివి..నీ చెలికాని చేరరావా
నీ నవ్వుల వెన్నెల్లు జల్లులు నాపై కురిపించి నా మదిలో అలజడి రేపావు.


38) గొంతు పెగలడం లేదు నిప్పులు చెరిగే నీలో కన్నీళ్ళా
కాదేమో వర్షపుచినుకుల చిరుజల్లులేమో మరి దారగా కారుతున్నాయేంటి


39) ప్రియా వరుణిన్ని పంపా నిన్ను ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ నా బాహువుల్లో ఒదిగిపోతావని


40) శూన్యం నుండి రాలే ప్రతి చినుకు నిన్ను చేరనివ్వడం
అందుకే నేనిలా నీకోసం విరహతో కాలి బూడిదౌతున్నా .. ఒక్కసారి వచ్చి చూసిపోవా .


41) నా జీవితపయనంలో 'ప్రేమ' మజిలీ రగిలించి ఎక్కడ దాక్కున్నావు జాబిల్లి

42) సిద్ధంగా ఉన్న సగం నవ్వు పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..


43) నీ తీయ్యని మాటలు,నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,నీ అంతులేని మాటల ప్రవాహాం ఎమయ్యాయి


44) రెప్పపాటులో జరిగిన ఘటనలు..ఊహకందని వాస్తవాలు..కన్నీళ్ళై తిరుగుతున్నాయి

45) ప్రతి క్షనం నీ జ్ఞాపకాలు వెంటాడు తుంటే..
ఏంటో చిలిపి కోరికలు చిందులు తొక్కుతున్నాయి..
వర్షంపడితే విరహంలో వెర్రి అలోచనలంటే ఇవేనేమోకదా..?


46) నీ స్పర్శ ఇచ్చిన భరోసానేమో నా హృదయమంతా నీ ఊపిరిగా మారింది!

47) సిద్ధంగా ఉన్న సగం నవ్వు పెదవులపైకి జారుతుంది
అలసట జతగా తెచ్చుకున్న అసహనం మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది ప్రియా


48) నువ్వు పంచిన స్వప్నాలు
రవి కిరణాలు తాకి కరిగిపొయాయి..వర్షపు చినుకులై


49) చీకట్లను పగులగొట్టాను..వెలుతుర్ని చూద్దామన్న తొందర్లో
చినుకులు పడాలా వద్దా అన్నట్టు ..ఎందుకో మబ్బుగా ఉంది నా మనస్సులా ఈరోజు


50) మన తియ్యని జ్ఞాపకాలన్నిటిని నిర్దాక్ష్యిన్యంగా
చిదిమేస్తుంటే మాటలు రాక మౌనంగా చూస్తునే ఉన్నా ప్రియా


51) చినుకులు పడుతున్నవేల నీ మౌనం నా చుట్టూ చేరినప్పుడు
ప్రకృతి నుంచి పొందే వింత అనుభూతులు..నీకైవెతికే నామనస్సుకు ఏమని చెప్పను..


52) నీవు నామనసుతో మౌనంగా నాతో చెప్పే ఉసులు
పెదవులు చాటున మూగగా పలికే కోటి రాగాలు లిపిలేని మౌన భాషలు గా మారాయి


53) వర్షంలో కమ్ముకున్న మబ్బుల్లా.
మనసునిండా చీకట్ల తెరలు కమ్ముకున్నాయి నీకేమి చెప్పలేక


54) నింగికి నిచ్చెన వేయాలేను.. తారల తోరణం కట్టాలేను
జాబిల్లిని సిగలో తురమలేనూ.ఆజాబిల్లిని మాత్రం మనసులో కొలువుంచుకోగనలు


55) నీవులేని ఒంటరితనపు సామ్రాజ్యంలో...
ఏకాంతపు ముసుగేసుకుని నన్ను నేను మర్చిపోతున్నా


56) రెండు క్షణాల మధ్య మిగిలిన నిశ్శబ్దంలో
రెండు హృదయాల మధ్య ఒదిగిన శూన్యంలో ఒక క్షణం త్వరగా కరిగిపోతుంది


57) కాలం తేలేని కావ్యానికందని గుండెకోతల్లో
మనమధ్య తెలీని అఘాదం ఎందుకో తెలీదు మనసా


58) నిశీధి కలలు రెక్క విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ నా ప్రేయసిపై కురిపిస్తున్నాయి..
మదిలోని భావాలు బారంగా నీకోసం ఎదురు చూస్తున్నాయి ప్రియా


59) సప్త లోకాల్లోని ఎన్ని భాషల్ని వెతికినా
నేననుభవించే విరహాన్ని వివరించే పదాలు లేవు ప్రియా


60) ఎదురు చూపులో తేడాలేదు..ఎడబాటు ఎన్నాళ్ళు అంటే..ఓ జీవితకాలం అని తేలిపోయింది

61) వర్షపు రోజు వానను చూడు ఆ చినుకులో నేనుంటా.

62) నీ జ్ఞాపకాలు జారిపడి శిధిలం అయ్యాను

63) నీవు లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
కాని నేను స్తబ్దుగా అయిపోయాను నిర్లిప్తంగా... శూన్యంగాలోకి చూస్తూ


64) గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు నీకిది న్యాయమా

65 ) కంటి నిండా కలలున్నాయి అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి అన్ని దారుమూసేసావుగా నీవు


66) మాటవినని నా మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు
ప్లీజ్ ప్రియా కాస్త నామనస్సు పంపిస్తావా మందలించి నీదగ్గరికే పంపిస్తా


67) నన్ను నేనే అద్దంలో చూసుకుంటాను
నేనెప్పుడూ కనిపించను ఎప్పుడూ నీవే కనిపిస్తావేంటో


68) ప్రేమ నాతో ఆడిన ఆటలో గెలిచింది
నన్ను నీ ప్రేమలో ముంచింది ..నీ జ్ఞాపకాల కన్నీటిని మిగిల్చి


69) చేతికి అందని జాబిలి నీవు . .జాబిలి మాటున వెన్నెల నీవు ప్రియా

70) నా కంటిపాపకు రెప్పవు నీవు . . నా కన్నులు కోరే స్వప్నం నీవు

71) మనసు పలికే మౌన భాషకు . . భావమిచ్చిన బాపుబొమ్మా

72) ఒరేయి అమ్మాయి అమ్మాయి అని అరవకు
అక్కడుంది అమ్మాయే...ఆమె నీకు తెల్సు అని అందరికి తెలియాలా..?


73 ) ఒరేయి అవి అక్షరాలురా..అందంగా పేరిస్తే అద్బుతాలు సృష్టించొచ్చు
అమ్మాయిలను ఇప్రస్ చేయడాకి వాటికి గలీజ్ అచేయకు రాబాబు నాశనం అవుతావు


74 ) మొహానికి నవ్వును అంటించుకొన్నా
లోపల భాదను దిగమింగడం చాలా కష్టమే కదా


75 ) ప్రియా నా కన్నీటికి ఎందుకు పక్షపాతం
తనువు గాయాలకు వెల్లువై నేనున్నానంటూ వచ్చి ఓదారుస్తుంది కన్నీరు


76) నీవు దూరం అయిన క్షనంలో నాలో రక్తం బదులు అక్షరాలు ప్రవహిస్తున్నాయేంటో అందుకేనేమో నేనో శవపేటికలో నిద్ర పోవాలని అక్షరాలను ఆసరగా చేసుకుంటున్నానేమో

77) వర్షపు జల్లుల చినుకులు మనసును మైమరపిస్తాయి
ఏవ్వరున్నా నేనున్నా అంటూ ప్రతిక్షనం మనకు గుర్తుచేస్తాయి


78) కళ్ళలొ నుండి ఉరికి వస్తున్న కన్నిటిని పెదవులతొ ఆపుతున్నాను...
ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను...


79) ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను
నీవు ఎంత ఆర్పాలని చూసినా అది ఆరిపోదు ... ఊపిరి ఆగిపోతే తప్ప


80) నాడు ప్రపంచమే ఓ చినుకు
ఆ చినుకే నా కవిత అది నీకోసం మాత్రమే పుట్టింది అనికూడా నీకు తెల్సు