. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, July 27, 2013

నన్ను నేను కోల్పోయాను. అలా కోల్పోయిన “నన్ను” నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నంలో

ఏమని చెప్పను? ఎన్నని చెప్పను?....
అసలెక్కడ మొదలెట్టను?
నీ అంత బాగా నేను మాట్లాడలేనని నాకు తెలుసు.
నీ అంత సూటిగానూ చెప్పలేనని నాకు తెలుసు.
నీకులా నేను రచనలు చేయలేను...

కవితలు రాయలేను...అందంగా మాట్లాడలేను
అతి మామూలు భాషలో... 

నాకు తెలిసిన కొద్దిపదాలతో
నీ సమక్షంలో నా జ్ఞాపకాలను పోగుచేసుకొని
నీకు అభిషేకం చేయాలని... పిచ్చి తలపు తో 

ఏదో రాయాలని ఏదేదే రాస్తూ ఇలా మిగిలిపోయా ఒంటరిగా అంతా మౌనం...
నీ ముందు పరచిన నా మూగవేధన
నీతో మాట్లాడలని... ఎన్నెన్నో ఊసులు చెప్పాలని...
నా మనసులోని భావాలను పంచుకోవాలని...
ఒకటే తహతహ...కానీ...నీ సమక్షంలో
నాకు దొరికే కొద్ది సమయంలో...
తుఫానుముందు నిశ్శబ్ధంలా...
నీ మౌనం నన్ను వేధిస్తోంది
నేను చేసిన తప్పేంటో నాకు తెలియకుంది
వాడు నా  SMSలు చూసి 

మనిద్దరి మద్యి పూడ్చలేని అఘాదాన్ని
మిలుస్తాడాని అప్పుడు అస్సలు ఊహించలే
ఆడపిల్లలా ఏడుస్తుంటే అన్నీ నిజం అని నమ్మా
అసలు నిజం తర్వాత తెల్సింది వాడో వేష్టుగాడని
దానిపై పడకూడని కళ్ళు పడతాయని తెలియదు
అందుకు నీ మౌనంతో నన్ను శిక్షిస్తావా?
అదెంత వేధనా భరితమో నీకు తెలియదా?
అయినా ఫర్వాలేదు నేస్తం నేను భరిస్తాను
నా స్నేహం నీకు కష్టం కలిగించింది అనుకుంటా
నా ప్రేమ నీకు నష్టం కలిగించింది అనుకుంటా
నీమీద ప్రేమ గుండెల నిండా వుంది
నీమీద ఆరాధన మనసు నిండావుంది
నీకళ్ళు నను వెంటాడుతూనే వుంటాయి
ఈ జన్మకీ జ్ఞాపకాలు చాలు నేస్తం...
మరు జన్మవరకూ బతికేస్తా...
ఈ వ్యధనంతా నీముందు చెప్పలేను
ఆ కళ్ళు నాకు బంధం వేస్తాయి
నను తన బంధీగా చేసుకుంటాయి
నీతో మాట్లాడాలని ఫొన్ చేతిలోకి
తీసుకుంటే చెయ్యి వణుకుతోంది ఎందుకనో?
నీ నంబరు డయలు చేయబోతే తెలియని ఆతృత ఎందుకో? నువ్వు గుర్తొస్తే , 

నా పక్కన ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప నువ్వు పక్కనుంటే, నేనంటూ లేనేలేను నువ్వు తప్ప! మరి ఏమంటావు నేస్తం ఈ అనుభూతిని?
ఒంటరితనంలో నిన్నటి మన స్నేహం గుర్తొస్తుంది
నీ సమక్షంలో మనసు మూగబోతుందెందుకో...
జీవిత సమరంలో నన్ను నేను కోల్పోయాను.
అలా కోల్పోయిన “నన్ను” నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నంలో కొన్ని పొరబాట్లు జరిగివుండొచ్చు..
అవి కావాలని చేసినవి మాత్రం కాదు..
అది నువ్వు నమ్మతే చాలు..
నా విజయాలు నీ మెప్పు పొందాలని
నీ చిరునవ్వులో చూసుకోవాలననే పేరాశ
కానీ...నిన్నెలా కోరను నేస్తం... ఈ వరాన్నివ్వమని?
నీకెలా వినిపించను నేస్తం... మనసు పలికే మౌనగీతాన్ని? నిన్ను చూసిన క్షణం నుంచి మరెప్పుడూ  గుర్తు చేసుకునే ప్రయత్నమే చెయ్యలేదు
అసలు మర్చిపోతే కదా, గుర్తు చేసుకోవడానికి.
నీ జ్ఞాపకం నాకు తోడుగా లేనిది ఎప్పుడని?
నీ కనులు చెప్పే ఊసులు నను వెంటాడనిదెప్పుడని?
అందుకే,నా కలల కూర్పుగా, నీ జ్ఞాపకాల సాక్షిగా,
ఇంతసేపూ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా....
నా అనుభూతిలోని గాఢత నీకు తెలీకపోతే;
నా ప్రేమలో నిజాయితీ లోపించినట్లే...