ప్రతి రోజు నిద్రకు
ముందు నీ గురించి ఆలోచిస్తాను
కానీ.. నా స్వప్న లోకంలో
నువెప్పుడూ కలవటం లేదు
ఏమో ఈనాటి
రాత్రయినా అదృష్టం వరిస్తుందేమో
ఆ ఆనందాన్నంతటినీ
ఒడిసి పట్టుకుంటాను
వెలుగుపై చీకటి దాడి చేస్తున్న వేల
నిశీధి కలలు రెక్క
విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు
ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ
నా ప్రేయసిపై
కురిపిస్తున్నాయి
నా గుండెలో
అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో
ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం
నా పక్కనే ఉన్న అనుభూతి
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న భావన
నేను అదృష్టవంతున్నయితే
ఈ రేయంతా మనదే
పోనీ ఓ క్షణమైనా చాలు
నువ్విచ్చే తీయటి ముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం చేస్తాను
వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని
ఏమో…ఏదో ఒకరోజు…
నా కల నిజమవుతుందేమో
అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనె ఉంటాను.