. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 22, 2013

నీవు లేని నేను లేనని తెలుసు నీకెపుడో

వసంత కాలం లో ఆమని కోయిల
ఎంత ఆనదంగా గీతాల్నాలపిస్తోంది
నా విరహాగ్నిని ఏ మాత్రం చల్లార్చలేని
అ గీతాల్ని ఎలా ఆస్వాదించను
కళ్ళన్నీ దు:ఖ జలధులై వర్శిస్తుంటే
ఓదార్పునిచ్చే తోడు లేని జీవితంతో
ఎంత కాలమీ పోరాటం?

సూర్యున్ని ఆర్పేసి
పడమటింటి గూట్లో
వెన్నెలదీపాన్ని వెలిగిస్తోంది దినం
అష్ట దిక్కులేకమై
ఎందుకని దినాన్ని ప్రశ్నిస్తే
నా సంధ్య కోసమంది
దినం దీపం వెలిగించే వేళ
పడమటి కనుమల్లో
కుంగిపోతున్న నన్ను
పక్షులు పలకరిస్తే
గొంతు పెగల లేదు
నిప్పులు చెరిగే నీలో కన్నీళ్ళా అని
పక్షులు చెప్పేవరకు తెలీదు
నాలోనూ హిమనదాలున్నాయని

నీవు లేని నేను లేనని తెలుసు నీకెపుడో
తెలిసి నేను నిన్ను చేరినా
తెలియక నే పడిన వెతలెన్నో
తెలియని అఙ్ఞానాంధకారంలో
అలసి సొలసి నేను తిరుగుతుంటే
తెలిసీ తెలియనట్లు వెన్నంటే ఉంటూ
జాడ తెలియనీకుండా..
బ్రతుకు సమిధలో ఆజ్యం పోస్తున్నావు
నీ ఊహలు నా మది నిండా నింపుకుని
నీ సందిట చేరాలని కలలు కంటూ వచ్చాను
నీవు కనిపించలేదని విలపించానే గాని
నింగి నీ సదనమని, వెన్నెల నీ వదనమని
కళ్ళుండీ చూడలేక పోయాను
నీ చేతిలో చెయ్యేసి
పున్నమి వెన్నెల వెలుగుల్లో
కృష్ణా తీరపు ఇసుక తిన్నెల్లో 

అడుగులెయ్యాలని
పొంగి పోయనేగాని
పొంగి పొరలే తరంగాలు
నీ మేని పొంగులని
తెలివుండీ తెలుసుకోలేక పోయాను
నీ పలుకు కోసం, నీ చల్లని చూపు కోసం
వీనులను వినువీధిలో పరిచాను
నీ పలుకు కోసం 

నా గుండె చప్పుడాపుకున్నాను
నీ రాకకై నేలనై పచ్చని 

తివాసీ పరిచాను
దారి చూపేందుకు 

నే వెన్నెలనౌదామనుకుంటే
నెల సగమే వెలిగే 

వెన్నెల కావొద్దని మనసొకటే గోల!
సముద్రమంత సంబరంతో
నీ చంద్ర వదన శోభకు
తరువుల పచ్చదనాన్ని, విరుల తెల్లదనాన్ని
వెన్నెల చల్లదనాన్ని
పారిజాత పరిమళాలతో రంగరించి
మదిలోని భావ తరంగాల్ని
అనురాగ రసాల్లో కలిపి ముద్ద చేసి
నీ సుతి మెత్తని పాదాలకు 

పారాణి పూయాలని
నీ పలకరింపుతో పులకరించాలని
నీ ఎద సందిట పరవశించాలని
నా తనువంతా కళ్ళుగా నిరీక్షిస్తున్నా…