జాబిల్లిని చూస్తున్నాను
ఏంటి అలా చూస్తున్నావని అడుగుతుంది
నీ దరి ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నానన్నాను
నవ్వుతూ అది అంత తేలిక కాదంటుంది
ఎందుకు కాదు అని నేను
ఎందుకు చేరాలనుకుంటున్నావని తను
నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది
ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని
శోధించాలని ఉంది అని నేను
ఆ వెలుగు నాది కాదు
నేనేమీ ప్రత్యేకం కాదు అని తను
నా ప్రపంచం లో నీ వెన్నలనే
చూడగలుగుతున్నానని నేను
ఈ వెన్నెల లేకపోతె ఏం చేస్తావని తను
ఒకసారి దగ్గర చేసుకున్నాక దూరం కానని నేను
మౌనంగా తను...ముని లా నేను
ఏంటి అలా చూస్తున్నావని అడుగుతుంది
నీ దరి ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నానన్నాను
నవ్వుతూ అది అంత తేలిక కాదంటుంది
ఎందుకు కాదు అని నేను
ఎందుకు చేరాలనుకుంటున్నావని తను
నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది
ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని
శోధించాలని ఉంది అని నేను
ఆ వెలుగు నాది కాదు
నేనేమీ ప్రత్యేకం కాదు అని తను
నా ప్రపంచం లో నీ వెన్నలనే
చూడగలుగుతున్నానని నేను
ఈ వెన్నెల లేకపోతె ఏం చేస్తావని తను
ఒకసారి దగ్గర చేసుకున్నాక దూరం కానని నేను
మౌనంగా తను...ముని లా నేను