. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 17, 2013

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...Part-1

లోకం ఆనంద మయం. ఆనందం కోసమే ప్రయత్నిస్తుంది. ప్రతి జీవి యొక్క పరమావధి ఆనందమే... పశువులు పక్షులు అన్నిటికి బాధ నుంచి తప్పించుకోవాలని హాయి గా బతకాలని ఒక్కటే ప్రయత్నం. మనుష్యులు హాయి గా బతకటమే కాకుండా కొన్ని విధాలైన ఆనందాన్ని కూడా పొందాలని చూస్తారు. బాధ కావాలని కోరే వారెవరు లేరు. కోరి బాధ లు పడే వాళ్ళూ, సుఖాన్ని త్యజించే వాళ్ళూ లేక పోలేదు. చచ్చిన వాళ్ళను మర్చిపోక వూరికే జ్ఞాపకం చేసుకుని ఏడ్చే వాళ్ళూ , ఇతరుల సౌఖ్యం కోసం తమ ఆనందాన్ని వొదులుకునే వాళ్ళూ, నోట్లోంచి కడ్డీలు దూర్చుకునే వాళ్ళూ , పంచాగ్ను ల మద్య తపస్సు చేసే వాళ్ళూ వున్నారు. కాని , ఆ బాధ వాళ్లకు ఆనందం కనుక లేక ఆనందకరమైనది బాధ వల్ల సమకూరుతుంది అనుకుంటారు కనుక , ఆ బాధ పడతారు.
ఆనందం అనేక రకాలు. ముఖ్యం పంచేంద్రియాలవల్ల, సంపాయించేది. మనసు వల్ల పొందేది.. వున్నతమైన ఆలోచనలూ, సంభాషణా స్నేహమూ ప్రేమా మొదలైన వాటివల్లా సౌందర్యాల వల్ల కలిగే ఆనందం; అందమైన కధలూ, నాటకమూ, సంగీతమూ, బొమ్మలూ మొదలైన వాటివల్ల కలిగే ఆనందం. ఈ ఆనందం లోనే యెక్కువ తక్కువ లు వున్నాయి. తిని నిద్ర పోయి జంతువులవలే బతుకులో పొందే ఆనందం, గంతులేసి నవ్వి అల్లరి గా వుంటే వచ్చే ఆనందం, తృప్తి పడి నా కింకేమీ అక్కర్లేదని శాంతం గా వుండే ఆనందం, లోకమంతా తనకే కావాలనే అధికారాలకీ, ధనార్జనకీ కష్ట పడుతు పొందే ఆనందం, దేశాల్ని, సంఘాల్ని బాగు చెయ్యలనీ, కొత్త విజ్ఞానాన్ని సంపాయించాలని, కొత్త లోకాన్ని కనిపెట్టాలనీ ప్రయత్నిస్తో జీవితాలర్పించే ఆనందం.

ఇవేకాక మనకు తెలీనివీ, ఈ భూలోకానికే చెందనివీ, ఇంకా మనం చూసే ఆకాశానికీ ఇతర గోళాలకు చెందినవీ అనేక విధాలైన ఆనందాలు వుండవచ్చు. చీమ పొందే ఆనందం వుంది మనం పొందే ఆనందం వుంది. భేదం ఇంద్రియ భేదం వలన కలుగుతోంది. దాని కళ్ళు మన కళ్ళు ఒకే కాంతిని చూడవు. చెవులు ఒకటే ధ్వని ని వినవు. అట్లానే మనకే ఇంకా బలమైన చెవులు - కళ్ళు వుంటే, ఆకాశ ధ్వనులు, కాంతులు, -- ఆకులు చేసే రహస్య గీతాలు -- కీటకాల సంభాషణ, -- ఎన్ని వినగలమో, చూడగలమో.


అంతే కాదు ఈ పంచేంద్రియాలు వుండబట్టి ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. పది జ్ఞానేంద్రియాలుంటే - పది రకాలు ఈ ఐదూ కాక, ఇంకో విధమైనవి వుంటే - కొంచం ఆలోచిస్తే తెలుస్తుంది - అనంత మైన ఆనందాలు వుండటానికి వీలుందని. భూలోకం లో ఈ విధమైన ఆనందాలున్నాయి; చంద్ర లోకం లో, అనూరాధా లోకం లో, ఆరుద్ర లోకం లో -- చెప్పలేము

ఇవన్ని శరీరాలకు సంభందించిన ఆనందాలు. మతాలు ఇంకో ఆనందాన్ని గురించి చెపుతాయి. ఆ ఆనందాన్ని స్వర్గ లోకం లో పొందుతామంటారు. ఆ ఆనందం రెండు విధాలు. భూలోకపు ఆనందాల వంటివే శరీరానికి సంభందించినవి, రెండోది ఈశ్వరుడి సాన్నిధ్యం వల్ల కానీ, స్తోత్రం వల్ల కాని, లేక ఐక్యం వల్ల కాని, కలిగే ఆనందమూ, ఆ స్వర్గానందాలకు భూఆనందాలకు విరోధం అంటారు. అవి కావాలంటే వీటిని త్యజించాలి. ముఖ్యం గా ఆ స్వర్గం సంగతి తెలిసిన వాళ్ళు కొన్ని నీతులను చట్టాలను ఏర్పరిచారు. ముఖ్యం గా వాటిని అతిక్రమించకుండా సంచరిస్తే ఆ స్వర్గము, ఈశ్వరుడు దొరుకుతారు. కాని , ఆ ప్రకారం చేస్తున్న మనుష్యులెవ్వరు కనబడరు. ఎవరికి అది నిశ్చయం లేదనుకుంటా. ఒకవేళ అందరు వివేక వంతులై ఆ స్వర్గం కోసం క్షణ భంగురమైన ఈ భూలోక ఆనందాలని త్యజించి ఆ శాస్త్ర ప్రకారం ఆ చట్టాలు, ఆ ధర్మాలు అనుష్టిస్తారు అనుకోండి, ఆ స్వర్గం ఏట్లా వున్నా ఈ భూలోకం ధ్వంసమైపోతుంది.

ఇప్పుడున్న తమాషా, నవ్వు, ప్రేమా, స్నేహమూ అన్నీ నశించి ఈ లోకం నివాస యోగ్యం కాకుండా పోతుంది. ఎంత త్వరలో ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి వెళితే అంత వుత్తమం గా తోచాలి ఈ ప్రజలకు. మొత్తానికి ఎవరిని చూసినా ఈశ్వరుడు, ఆయన లోకమూ, దాని మార్గము గురించి మాట్లాడే వాళ్ళే కాని, ఈ లోకాన్ని విడిచి ఆ లోకానికి, దాని ఆనందాల కోసం త్వర గా ప్రయాణమవుతున్న వాళ్ళు ఎవ్వరు కనిపించరు.