. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 19, 2013

మాటలన్నీ తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోతాయి

నీ పరిచయం నాలో వలపు వీణలు మీటుతుంటే
నా ప్రమేయం లేకుండానే
నిన్ను చూడాలనే ఆరాటం గుండెల్లోంచి తన్నుకొస్తుంది
నీతో మాట్లాడాలనే ఉద్వేగం అధరాలపై
మాటలన్నీ పోగేసి నదీ ప్రవాహమై నీ దగ్గరకొస్తే
నీ చూపులు మలయ మారుతాలై నన్నల్లుకోగానే
బిడియపు తాళం పడిన నాలుక మౌనం దాల్చి
పోగేసుకొచ్చిన మాటలన్నీ
తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోతాయి
లిపి లేని చూపులైనా సూటిగా భావాన్ని అందిస్తాయని
మనో వేధనను కళ్ళల్లో నింపుకుని నీ ముందుకొస్తే
నీ చూపుల ఉప్పెనలో పడి నా చూపులు కొట్టుకు పోతే
ఒణికి తొణికిసలాడే మనసును ఉగ్గపట్టుకుని
గొంతు పెగల్చుకుని మాటలు రూపం దాల్చేలోగా
కనుమరుగై పోతావు
గుండె గొంతుకలో నలిగి పోయిన భావాలు
నిశ్శబ్ద గీతాలై నన్ను వెక్కిరిస్తున్నాయి.