. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 17, 2013

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...Part-3

ప్రతి జీవికి కొంత శక్తి వుంది. కొంత కాలం వుంది. ఈ శక్తినీ కాలాన్నీ ఆనందం లో కూర్చుకునే తెలివితేటలు లేవు. జీవితం "ఆర్ట్". ఒక కళ. మనం వివేకవంతులమైతే మన శక్తి నంతా ఆనందం గా మార్చుకోగలం. మన కాలమంతా మనకు ఆనందాన్ని ఇచ్చేట్లు చేయగలం. ఈ మహా శక్తి మన పుటకవల్లనో సంస్కారం వల్లనో కొంత కలుగుతుంది. కొంత మనకు చిన్నప్పుడు ఇతరులు నేర్పిన "అలవాట్ల" వల్లా పెద్దయ్యి మనకు మనమిచ్చుకునే శిక్షణ వల్లా యేర్పడుతుంది.

లోకం లో మొత్తానికి ఎవరు ఆనందవంతులుగా కనపడుతున్నరంటే, వారి స్వభావాలకీ, గుణాలకి, వేటి వేటి మధ్య వున్నారో పరిస్తితులకు; సమత్వం కలిగించుకున్న వాళ్ళు.. చాపలు ఎంత మంచి మందిరాలలో వుంటే యేమి లాభం? ఏనుగులు సముద్రాల మధ్య తెల్లని ఇసుకల్లో పడుకుంటే ఏం సౌఖ్యం? తక్కువ స్థితిలో వున్నా, ఎక్కువ స్థితి లో వున్నా సరిపోవాలి. లోకానికి వ్యక్తి కి సంధి కుదరాలి. వ్యక్తి లోని శక్తులన్నీ చక్క గా వినియోగమయ్యే పరిస్తితి వుండాలి. చిత్రకారుణ్ణి చిత్రించ వద్దని ఆజ్ఞ పెట్టి మహారాజు గా చేసినా అతనికి తృప్తి వుండదు. తన కళ కోసం బాధ లోనే వుంటాడు.


లోకం లో అనేక విధాలైన ప్రాణాలున్నాయి. కంటి కగపడని సూక్ష్మ జీవుల నుంచి మనుష్యుల వరకు -- అనేక స్తితులలో అనేక ప్లేన్ ల లో బ్రతికేవి వున్నాయి. వేటి గుణాలు,ఆకారం,కష్టాలు, ఆనందం,ఇంద్రియాలు, బుద్ది వాటివే. కీటకాల్లో అనేక రకాలు. పక్ష్యులలో - చేపల్లో - జంతువుల్లో అనేక బేధాలు వున్నాయి. అట్లానే మనుష్యులలో వున్నాయి. దేశం వల్ల, రేస్ వల్లా పరిస్థితుల వల్ల కలిగే బేధాలు కాక మనిషికి మనిషికి ముఖం లో -- కంఠం లో దేహాకారం లో... రేఖలలో, రుచులలో, గుణాలలో బేధాలున్నాయి. ఈ బేధాల్ని మత ప్రవక్త లు నీతి ప్రవక్త లు ఒప్పుకోరు. సర్వ మానవులకు ఒకటే మత విశ్వాసం, ఒకటే నీతి, చట్టము విధిస్తారు. ఒకరికి కుదిరిన మందు ఇంకొకరికి కుదురుతుందని, ఒకరికి ఆనందమిచ్చిన విషయం ఇంకొకరికి ఆనందమిచ్చి తీరాలని మూఢాభిప్రాయం ప్రజలనికా వదల లేదు. అసంఖ్యాకాలైన ఆనందాలిని, అభిరుచులను, సౌందర్యాలను ఏర్పరిచిన సృష్టి కొల్లబోలేదు.... వాటినన్నిటిని వివిధ రీతుల అనుభవించేందుకే వివిధాలైన స్వభావాలను సృష్టించింది. ఏకత్వం, సమానత్వం సృష్టి సూత్రానికే విరుద్ధం.

ఒక కాలం లో దేశాలకీ, సంఘాలికి సరిపడిన నీతి, ఆచారం ఇంకో కాలం లో కూడా సరిపడి తీరాలని, ఒక దేశానికి జాతికి అనుకూలించిన పరిస్తితులు ఇంకో దేశానికి జాతికి అనుకూలించాలని వాదించే వారు అనేకులు. ఎట్లా మనిషి మనిషి కు రూపము, బుద్ది, మారుతుందో అట్లానే వారి స్వభావాన్ని, సంస్కారాన్నీ, బుద్ధి ని బట్టి నీతి ఆనందం మార తాయంటే అంగీకరించరు. థియరీ లో అంగీకరించినా ఆచరణ లో ఒప్పుకోరు.

ఈ మత సిద్ధాంతులు, నీతి ప్రవక్త లు,ప్రతి వారమూ సాయింత్రమూ వేదిక నించి, రోడ్డు మూలల నుంచి వుపన్యాసాలిచ్చే దేవ భృత్యులూ ఎవరికి తోచినట్లు ఆనందపడే విధాలు ప్రకటిస్తూ వుంటారు.


"సత్యం చెప్పండి బాధలన్నీ పోతాయి" " నా గీతాలను చదవండి", క్రీస్తు ను నమ్మండి", "యోగం చెయండి", "తొట్టి వైద్యం", కార్కు టిప్పు సిగిరెట్ట్లు," , " చచ్చిన వారితో సంభాషణ" " అపక్వాహారం", "సర్వ భాతృత్వం" --తలనూనెలు - స్వరాజ్యం, -- లైబ్రరీలు, " ఇట్లాంటి వాటి ద్వారా వేనవేలు చిరతరానందాన్ని ప్రపంచాలకు ప్రకటిస్తున్నారు.