జన్మజన్మకు నీతోడు
వాడనిదమ్మా నా వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నేల దిగిరావే... నన్నేల మరిచావే..
దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా...
ప్రతి ఒక జన్మా నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా...
దేవత నీవని గుడికడతా... జీవితమంతా పూజిస్తా...
నేల దిగిరావే నన్నేల మరిచావే...
నీలి నింగిలో నిండుజాబిలీ
నేల దిగిరావే... నన్నేల మరిచావే
నువులేని నేను శిలను...
మెలకువేలేని కలను
నిను వీడి నేలేను... నే ఓడి మనలేను
ప్రేమకు మరుపే తెలియదులే
మనసు ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు