అంతులేని ప్రశ్నలతో
రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
ఇద్దరికీ మధ్య భౌతికంగా దూరం
మౌనంలోనే..
మోయలేని సంకేతాలని
గ్రహించే మనసుకి
ఏ నిర్వచనాన్ని అందించను
నాకెప్పటికీ అర్థం కాదు
నీ ఙ్ఞాపకాలు
నా మనసునెందుకిలా బాధిస్తాయో
నువు చెప్పవూ…
ఇవే క్షణాలు…
సాయంత్రాలు
సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసు మధుర్యాల్ని వెదజల్లేది
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాల్ని ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా ఊగేవి
ఆశలు కిరణాలై హృదయాన్ని
ఆవహించే నీ పలుకులు ప్రియా
రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
ఇద్దరికీ మధ్య భౌతికంగా దూరం
మౌనంలోనే..
మోయలేని సంకేతాలని
గ్రహించే మనసుకి
ఏ నిర్వచనాన్ని అందించను
నాకెప్పటికీ అర్థం కాదు
నీ ఙ్ఞాపకాలు
నా మనసునెందుకిలా బాధిస్తాయో
నువు చెప్పవూ…
ఇవే క్షణాలు…
సాయంత్రాలు
సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసు మధుర్యాల్ని వెదజల్లేది
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాల్ని ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా ఊగేవి
ఆశలు కిరణాలై హృదయాన్ని
ఆవహించే నీ పలుకులు ప్రియా