మనలోని ఆలోచనలు .. ఆరాటాలను
ఒకరికి తెలియకుండా మరొకరం
అర్థం చేసుకునే లోపే
పది కాలాల పాటు
పదిలంగా కాపాడుకుంటూ
అత్యంత భద్రంగా దాచుకున్న
మన బందంపై ..
అవమానపు మాటలు
మనసును వేదిస్తున్నా
మనసులు కలిసిన వేళ
గుండెల్లో ప్రేమతనం ప్రాణమై
నిలువునా దహించి వేస్తున్న చోట
ఇక చూడటమే పాపమై పోయింది
నిన్ను కలుసుకోవటం
గగనంగా మారింది ..
నీవక్కడ కలలతో
మమేకమవుతే
అలలతో నేనిక్కడ కడలి కెరటమై
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం
తప్పెలా అవుతుందో
తన్నుకుచచ్చినా
అర్దం కావడంలేదు
ఎవరిని ఎలా అర్దం
చేసుకొవాలో తెలియడం లేదు
ఎవరు ఎప్పుడు ఎలా
మారతారో తెస్లుకోలేకపోతున్నా
నిజం , అబద్దం కల్సిపోతే దేన్ని
నమ్మాలో తెలియడంలేదు
నాది అన్నది కాకుందా
దూరంగా పోయి వెక్కిరిస్తే
గుండెలు పగిలేలా అవమానిస్తే
ఒకరికి తెలియకుండా మరొకరం
అర్థం చేసుకునే లోపే
పది కాలాల పాటు
పదిలంగా కాపాడుకుంటూ
అత్యంత భద్రంగా దాచుకున్న
మన బందంపై ..
అవమానపు మాటలు
మనసును వేదిస్తున్నా
మనసులు కలిసిన వేళ
గుండెల్లో ప్రేమతనం ప్రాణమై
నిలువునా దహించి వేస్తున్న చోట
ఇక చూడటమే పాపమై పోయింది
నిన్ను కలుసుకోవటం
గగనంగా మారింది ..
నీవక్కడ కలలతో
మమేకమవుతే
అలలతో నేనిక్కడ కడలి కెరటమై
ఒడ్డున నిలుచున్నా
స్వేచ్ఛలేని చోట ప్రేమ ఉండదని
ప్రేమించటం కష్టమని తెలుసుకున్నా
అయినా .. ఒక మనిషిని
మరొకరు కోరుకోవటం
తప్పెలా అవుతుందో
తన్నుకుచచ్చినా
అర్దం కావడంలేదు
ఎవరిని ఎలా అర్దం
చేసుకొవాలో తెలియడం లేదు
ఎవరు ఎప్పుడు ఎలా
మారతారో తెస్లుకోలేకపోతున్నా
నిజం , అబద్దం కల్సిపోతే దేన్ని
నమ్మాలో తెలియడంలేదు
నాది అన్నది కాకుందా
దూరంగా పోయి వెక్కిరిస్తే
గుండెలు పగిలేలా అవమానిస్తే