ప్రతి రోజు నిద్రకు ముందు నీ గురించి ఆలోచిస్తాను
కానీ.. నా స్వప్న లోకంలో నువెప్పుడూ కలవటం లేదు
ఏమో ఈనాటి రాత్రయినా అదృష్టం వరిస్తుందేమో
ఆ ఆనందాన్నంతటినీ ఒడిసి పట్టుకుంటాను
గుండెను గుడిగా చేసుకొని అన్నీ దాచేసుకుంటాను
నేను అదృష్టవంతున్నయితే
ఈ రేయంతా మనదే
పోనీ ఓ క్షణమైనా చాలు
నువ్విచ్చే తియ్యటిముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం చేస్తాను
నా గుండెలో అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం నా పక్కనే ఉన్న అనుభూతి
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న భావన
వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని
ఏంటీ ఇదంతా నిజమేనా
ఊహలే ఇంత అందంగా వుంటే
నిజం ఎంత బాగుంటుందో..
ఆ నిజం ఒక్కరాత్రైనా పర్లేజు..
ఆ రాత్రి గడిపి కాలాన్ని శాశిస్తా
లేదంటే మరుసటి వేకువను చూడకున్నా చాలు
ఆరాత్రి అనుభవం అదే నాజీతం అని సరిపెట్టుకుంటా
కానీ.. నా స్వప్న లోకంలో నువెప్పుడూ కలవటం లేదు
ఏమో ఈనాటి రాత్రయినా అదృష్టం వరిస్తుందేమో
ఆ ఆనందాన్నంతటినీ ఒడిసి పట్టుకుంటాను
గుండెను గుడిగా చేసుకొని అన్నీ దాచేసుకుంటాను
నేను అదృష్టవంతున్నయితే
ఈ రేయంతా మనదే
పోనీ ఓ క్షణమైనా చాలు
నువ్విచ్చే తియ్యటిముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం చేస్తాను
నా గుండెలో అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం నా పక్కనే ఉన్న అనుభూతి
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న భావన
వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని
ఏంటీ ఇదంతా నిజమేనా
ఊహలే ఇంత అందంగా వుంటే
నిజం ఎంత బాగుంటుందో..
ఆ నిజం ఒక్కరాత్రైనా పర్లేజు..
ఆ రాత్రి గడిపి కాలాన్ని శాశిస్తా
లేదంటే మరుసటి వేకువను చూడకున్నా చాలు
ఆరాత్రి అనుభవం అదే నాజీతం అని సరిపెట్టుకుంటా