. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 26, 2013

“ఈ ఒక్క మనిషి ఉంటే ఏ పనైనా చేసేయగలం..” అన్నంత నమ్మకం వచ్చేస్తుంది.

కొంతమందిని చూస్తే.. “ఈ ఒక్క మనిషి ఉంటే ఏ పనైనా చేసేయగలం..” అన్నంత నమ్మకం వచ్చేస్తుంది. వాళ్లు మాట్లాడే విధానంలోనే… “అదెంత పని.. ఒకటి రెండు రోజులు కష్టపడితే అయిపోయేదానికి ఎందుకండీ టెన్షన్” అంటూ సమస్యని చాలా తేలిక చేసేస్తారు. అలా ఓ ఉచిత సలహా ఎవరైనా ఇచ్చేయగలరు. కానీ వీళ్లు మాత్రం “మీకెందుకు శ్రమ.. నాకు అప్పజెప్పి మీ పని మీరు చేసుకోండి” అని పూర్తి అభయహస్తం చాపేస్తారు.
ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం తోటి వ్యక్తికి చేతనైనంత చేద్దామన్న ఆలోచనతోనే బ్రతికే ఇలాంటి మనుషులు  కానీ నా దృష్టిలో చాలామంది గొప్ప వ్యక్తులున్నారు. వాళ్లు నా పట్ల గౌరవం కొద్దీనో, అభిమానం కొద్దీనో, లేదా ఏదో ఒక అవసరం కొద్దీనో సాయపడలేదు, పడట్లేదు. వాళ్ల నేచరే అంత గొప్పది. ఆణిముత్యాలు. వాళ్లని చూస్తుంటే కొండంత ధైర్యమొస్తుంది. వాళ్లలా ఉండాలన్పిస్తుంది..… నాకన్నా వాళ్లు చాలా గొప్ప వాళ్లని.ఎవరైనా సాయం కోసం వచ్చినప్పుడు.. సహజంగానే మనం సాయం చేయకపోగా చులకనగా చూడడం, డిజప్పాయింటెడ్‌గా మాట్లాడడం గొప్పగా భావిస్తుంటాం. మనం ఓ నవ్వు నవ్వి మాట్లాడితే అవతల మనిషి మనస్సు తేలికవుతుంది. ఎన్నో ఇబ్బందుల్లో విపరీతంగా ఆలోచించేసి బాధపడుతున్న జనాల్ని మళ్లీ నిరుత్సాహంగా మాట్లాడేసి మరింత కుంగదీయడం కరెక్ట్ కాదు కదా? మనం సాయం చెయ్యకపోయినా.. ఆ పని అవుతుందన్న ధీమా ఇవ్వగలిగితే ఆ కొంత పాజిటివ్ ఎనర్జీ చాలదా అవతల వ్యక్తి పుంచుకోవడానికి?
“నీకు నేనున్నాను” అనే ధీమా అస్సలు మనం ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాం? డొల్ల రిలేషన్లని ఎమోషనలైజ్ చెయ్యడానికి “నీకు నేను లేనూ..” అని ఓ గొప్ప అలెగ్జాండర్‌లా ఫోజులివ్వడం కాదు.. నిజంగా ఎంతమందికి మనం ఏ క్షణమైనా ఉన్న ఫళాన ఆదుకోవడానికీ, సాయం చేయడానికీ ముందుకు రాగలం? ఎవరెలా పోయినా.. ఎవరి గురించీ మనకు పట్టకపోయినా మనం దర్జాగానే బ్రతుకుతాం… కానీ సాటి మనిషికి చేయగలిగీ ఏమీ చెయ్యలేకపోయామే అనే ఓ తెలీని వెలితి మనస్సులో ఎప్పటికీ తీరదు.మనుషుల్ని చూసి భయపడడమో, భయపెట్టడమో, కోప్పడడమో, ద్వేషించడమో, చిరాకు పడడమో, డిజప్పాయింట్ చేయడమో.. ఇలా దూరంగా నెట్టి పారేయడం మానేస్తే… మనుషులు సహజంగానే మనల్ని పెనవేసుకుపోతారు. అదీ మానవత్వం!