. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 16, 2013

ఈ అందమైన లోకానికి కళ్ళు కిటికీలై చూపును ప్రసాదిస్తాయి


దుఖం కమ్ముకున్న చోట
ఏకాంతంలో ఒంటరినై సంచరిస్తున్న చోట
ఆలోచనలు కమ్ముకుంటున్న వేళ
హృదయపు వాకిల్లలో
కళ్ళు పరికిస్తాయి
మనకు తెలియకుండా
మనల్ని గమనిస్తూ ఉంటాయి ..

కళ్ళు ప్రపంచానికి ద్వారాలు
మదిలో మెదిలే భావాల పరంపరకు
ప్రాణమవుతాయి ..
మనకు మట్టితనాన్ని గుర్తు చేస్తాయి

ఈ అందమైన లోకానికి
కళ్ళు కిటికీలై చూపును ప్రసాదిస్తాయి ..
ఆ కళ్ళే కదా
మనకు తెలియకుండా
మనల్ని శల్య పరీక్ష చేసేవి ..

కళ్ళు వాకిళ్ళు
సంచారంలో సంయోగాన్ని నేర్పే
వలపు మాధుర్యాన్ని పంచే మల్లెలు
స్వేచ్చగా ఎగిరే పక్షులు
గాలికి రెపరెప లాడే కొమ్మలు .. చెలి ముంగురులు

చిమ్మ చీకటిలో
ప్రేమను పంచే కలువలు కళ్ళు
హృదయాలకు అనురాగాన్ని నేర్పే సన్నజాజులు
కొన్ని కళ్ళను చూస్తే
అలాగే ఉండిపోతాం
మరి కొన్ని కళ్ళను చూస్తే చాలు
జన్మ ధన్యమై పోయిందని ఆనంద పాడుతాం

రహదారి బతుకులో
తోవ చూపించే నావ కళ్ళే ..
గుండెల్లో గూళ్ళు కట్టేవి కళ్ళే

అవును
కళ్ళు మాట్లాడుతాయి ..కవ్విస్తాయి
కనురెప్పలకు కలలు కనడం నేర్పుతాయి
కళ్ళు లోకానికి తలుపులవుతాయి
రెండు శరీరాలు పెనవేసుకునే వేళ
కళ్ళు మౌనంగా వాలిపోతాయి
గుమ్మం ముందు తోరణాలు అవుతాయి
అంతా అయిపోయాకా
చెమట చుక్కలవుతాయి
పెదవులు మూసుకున్నప్పుడు
కళ్ళు విచ్చుకుంటాయి కలువల్లా ..

కళ్ళే కదా దోచుకునేది
కళ్ళే కదా గుండెలను మీటేది
కళ్ళే కదా వడిలో వాలేలా చేసిది
కళ్ళు లేకుంటే ... ఉన్నా లేనట్టే


- Bhaaskar Palamuru