. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 17, 2013

చలం గారి ఆనందం పుస్తకం నుంచి ఒక వ్యాసం...Part-4

ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చే మాట నిజమే కాని కొన్ని కొన్ని కొందరికి మాత్రమే ఇస్తాయి. కాకి, చచ్చిన ఎలకను తింటే ఆనందమని ఏనుక్కి చెప్పి, చేపలా నీటిలో ఈదమని నక్క కు చెప్పినట్లు వుంటుంది. ప్రతి వాడు తన స్వభావానికి, తన గుణానికి ఏ ఆనందం కావాలో అవి కనుక్కోవాలి. ఆ స్వభావం ఆనందం వైపు ఈడుస్తుంది. కాని ఈ ప్రకటనలు చూసి మోస పోతారు. ఈ ప్రకటనలలో ముఖ్య మైనవి శాస్త్రాలు,, నీతులు, ఆచారం, ధనం, అధికారం మొదలైన భ్రాంతులు. ఒక యోగి వచ్చి ఆసనం చూపగానే అందరూ ఆసనాలు ప్రారంభిస్తారు. పండితులు వచ్చి జుట్టు గొరిగించమనగానే గొరిగిస్తారు. శాంతి లేక కొట్టూకునే ధనవంతుడు భార్య కావాలని యేడిచి పెళ్ళి చేసుకుని "ఎందుకు చేసుకున్నానని" యేడుస్తాడు. పిల్లలు లేరని ఏడ్చే వాళ్ళు,, వుద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు, ప్లీడరై కవుల వెంట పరుగెత్తే రసికుడు, పెళ్ళి చేసుకుని నమ్మకం గా నిలువలేని స్త్రీ, చదువుకుని ఆరోగ్యం పోగొట్టుకున్న రోగి,
కధలు చదివి, సినిమాలు చూసి భ్రమసి ఇల్లు వదిలి పరుగెత్తి తిరిగి వొచ్చిన జోగి, -- అందరూ, ఇట్లాంటి మూర్ఖులు - తమ ఆనందం తెలీక మాటలు నమ్మి మోసపోయిన ధౌర్భాగ్యులు,. తనకు లేని వస్తువు ఆనందం ఇస్తుందనుకోవటం ఈ భ్రమలలో ముఖ్య మైనది.


"ఈ పెళ్ళి నరకం " రా అని ఎంత మంది ఎంత చెప్పినా బాల బ్రహ్మచారి ససేమిరా నమ్మడు. " నీ పెళ్ళాన్ని వదలవేం?" అంటాడు. "ధనం వల్ల సౌఖ్యం లేదు" అని ధనికుడెంత అరిచినా బీదవాడు నమ్మడు. "ధనమంతా నాకియ్యవే" --అంటాడు. ఏ ఆనందం రాకపోయినా ఆ పెళ్ళాన్ని, ధనాన్ని వొదిలే ఆత్మబలం వాళ్ళకు లేదనే సంగతి వీళ్ళకు తెలీదు.


కొందరికి దేశ విప్లవం, కొందరికి తిండి, కొందరికి ప్రేమ, కవిత్వం, తగాదాలు, - నిద్ర - ఇట్లా అనేక ఆనందాలు వున్నాయి. తత్వాన్ని బట్టీ మారుతో, ఎవరు చెప్పిన మాట వినకుండా, తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ను నమ్ముకుంటే, ఏ మనిషికి అతని ఆనందమేదో స్పృష్టమవుతుంది. ఏ మృగానికి దాని ఆహారమేదో అర్ధమైనట్లు... కాని ఈ మనుష్యులలో జన్మమంతా మాంసం తినే ఆవులు, గడ్డి మేసే సింహాలూ వున్నాయి. -- పైగా అజీర్నమెందుకా అని ఆవు అనేక రకాల మాసం రుచి చూస్తుంది. సిం హం రక రకాల గడ్డి తెప్పించుకుని మేస్తుంది. కాని ఆ గడ్డిని ఇది ఆ మాంసాన్ని అది వొదిలే తెలివితేటలు కాని, ధైర్యం కాని, శక్తి కాని వాటికి వుండవు.