. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 9, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(11)

1) ప్రియా నా కన్నీటికి ఎందుకు పక్షపాతం
తనువు గాయాలకు వెల్లువై నేనున్నానంటూ వచ్చి ఓదారుస్తుంది కన్నీరు


2)  నీవు దూరం అయిన క్షనంలో నాలో రక్తం బదులు అక్షరాలు ప్రవహిస్తున్నాయేంటో 
అందుకేనేమో నేనో శవపేటికలో నిద్ర పోవాలని అక్షరాలను ఆసరగా చేసుకుంటున్నానేమో

3) వర్షపు జల్లుల చినుకులు మనసును మైమరపిస్తాయి
ఏవ్వరున్నా నేనున్నా అంటూ ప్రతిక్షనం మనకు గుర్తుచేస్తాయి


4) కళ్ళలొ నుండి ఉరికి వస్తున్న కన్నిటిని పెదవులతొ ఆపుతున్నాను...
ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను...


5) ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను
నీవు ఎంత ఆర్పాలని చూసినా అది ఆరిపోదు ... ఊపిరి ఆగిపోతే తప్ప


6) నాడు ప్రపంచమే ఓ చినుకు
ఆ చినుకే నా కవిత అది నీకోసం మాత్రమే పుట్టింది అనికూడా నీకు తెల్సు


7) భావాలకు నిద్ర,జోలపాట,లాలి పాట
భావాలు మల్లీ చిగురిస్తాయి కవితల వర్షాలై కురుస్తాయి


8) చావుకి బ్రతుక్కి మద్యి .. నీవు చేసిన అవమానం కత్తిలా వ్రేలాడుతోంది
ఆ కత్తి ఏక్షనమైనా నా పీక కోస్తుందేమో ..అవమానంకంటే చావు గొప్పది కాదేమో ప్రియా


9) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తంగా నను స్వాగతిస్తావా...
నీకోసం మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా చెప్పు.


10)  మొలకల అంచుల నుంచి, ఆకుల చివర్ల నుంచి,
రాలే చినుకులు చూసి పరవశించే మనిషి మనసు పులకింత చెప్పతరమా


11) ఇది కాదు తొలకరి తుల్లింత కేవలం ప్రకృతి పులకరింత మనసు జళ్ళింత

12) రాలే చినుకులు చూసి పరవశించే మనిషికి
నల్లని మబ్బుతునకలు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా ప్రియా


13) వలపు ఆకాశంలో నల్లని తలపుల మేఘాలు ఢీకొని కురిసింది ప్రేమ జల్లు

14) కిటికి లాంటిదే మనస్సు కూడా ఏమాలోచిస్తుందో తెలియదు
అంతరాంతరాల్లో ఏదో తవ్వకం జరిపి లోతుల్లోకి దూచుకెలుతుంది


15) కిటికీ చిన్నదే కాని దాని ఆశ అనంతంలోకి చూపు సృష్టి దూరాల్లోకి.

16) ఒక్కోసారి నీ జ్ఞాపకాలు నా మనస్సు సముద్రమై వెన్నెలను తాకుతాయి

17) అబ్బా ఎవరండి తడిచిన బట్టలు సరిగ్గా పిండలేదా
ఆకాశం నుంచి తడిబట్టను ఎవరో దులుపుతున్నట్టున్నారు నీటి తుంపర్లు పడుతున్నాయి


18) ఆకాశంలో ఎవ్వరో చిల్లు బిందె పెట్టారేమో
బొట్లు బొట్లుగా కురుస్తున్న వాన జల్లు..గుండెలపై హాయిగా


19) నేనున్నాననే నమ్మకం సర్వం తానే అనిపిస్తుంది
నువ్వులేవు అన్నమాటలోనే నేనేమౌతానోనని నిర్లిప్తత ఆవరిస్తుంది


20) ఒకప్పుడు నీ సన్నిధి కనురెప్పై తోడుంటుంది
ప్రతిక్షనం నువ్వులేని ఒంటరితనం భయపెడుతుంది ప్రియా


21) నడిరాతిరి నిశ్శబ్దమంత గంభీరంగా వుంటుంది
తడబడే మనసుపొరలకు బంధం వేస్తుంది నిన్ను తలస్తూ


22) దూరమైన నేస్తమా జ్ఞాపకాల మణి హారమా!
వీడిపోని బంధమా వాడిపోయి సుమగంధమా మదిలో మణిహారమా


23) మనసు గదిలో స్థబ్దతగా ఉన్నా కనిపించని నీకోసం వెతుకుతూ
హృదయాంతరాలలో మాత్రం విస్పొటాలు ముగింపు లేని ఈ సమస్యల పరంపరలో


24) నాలోని నన్ను శోధిస్తూ నీకోసం ఒంటరిగా నేనొక్కడినే నేనొక్కడినే ఒంటరిగా

25) అపరాధ భావాలన అంతర్మధనంతో
కన్నీళ్ళతో జరిగిన గతాన్ని తడుపుకొంటూ మౌనంగా రోధిస్తూ


26) జీవితపు డైరీలోని నల్లని పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి


27) సాయం సంద్యివేళ మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ..కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా ?


28) నా కోసం చిరునవ్వొకటి చిందిస్తావా... నీకోసం మృత్యువునైనా ఆహ్వానిస్తా

29) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తంగా నను స్వాగతిస్తావా...
నీకోసం మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా చెప్పు ప్రియా.


30) ఆగిపోయిన శ్వాస నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది
మూతబడిన కనులు రెప్పల్లోంచి నీకోసం వెతుకుతున్నాయి


31) ఎదుర్రాయి కాలికి తగిలి ప్రాణం జివ్వుమంన్నట్టు
నీవు చేసిన అవమానం గుండెల్లో రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంది


32) విషాద నిశ్శబ్దాలను స్వరపరచాలనుంటుంది
అన్నవాహికలో దాగివున్న బావాలను తవ్వి వెలిగితీయ్యాలని ఉంది


33) నింగికి నిచ్చెన వేయాలేను.. తారల తోరణం కట్టాలేను
జాబిల్లిని సిగలో తురమలేనూ.ఆజాబిల్లిని మాత్రం మనసులో కొలువుంచుకోగనలు


34) స్పందించే మనసుకు తెలుసు నా ఆరాధన భావమే౦టో....
కదిలిపోయే కాలానికి తెలుసు నా నిరీక్షణ వేదనే౦టో..మరి నీవేం తెల్సుకున్నావు


35) మండుతున్న గుండెకు కన్నీళ్ళతో స్నానం చేస్తున్నా అంతకు మించి ఏం చేయలేక

36) మరిచిపోలేని ..మరువలేని అనుభవాలను మిగిల్చి
చిమ్మ చీకటి లో పండు వెన్నెల పరుగులు పెట్టిందెందుకో


37) గుండెలో ఉన్నావులే అనుకున్నా అగుండెన్నే చీలుస్తావని ఊహించేలేదు ప్రియా

38) నువ్వు లేవు నీ మాట మిగిలే ఉంది..అది గుండెల్లో రక్తాన్ని చిందిస్తుంది ప్రియా

39) స్నేహం అనేది ఒక భావంభావం అనేది ఒక ప్రాణం
ప్రాణం అనేది ఒక జీవంజీవం అనేది ఒక రూపంఆ రూపానికి నీవేఒక ప్రతి రూపం


40) మర్చిపోలేని జ్ఞాపకంలా నువ్వుంటావని ఆశ పడితే
జీవితాన్నే నీవు లేని జ్ఞాపకంగా మిగిలిపోతావని అస్సలు ఊహించలేదు


41) మనసు మూగగా రోదిస్తుంది గతంలో నీవు చేసిన గాయపు భాదతో

42) ఏకాంతంమా ఎవరు నీవు నేనొంటరిగా ఉన్నా అని ఎవరు చెప్పారు..
నాలో ఎవరున్నారో తెల్సి వస్తున్నావా..? ఎవరు నిన్ను పంపారో నాకు తెల్సులే


43) నింగిలో ఉన్నా నేల పై ఉన్నా నీవునాలో ఉన్నావన్న తలపే
పచ్చని సుతిమెత్తని పచ్చిక తిన్నెలపై పారాడుతున్న చల్లని నీటిని తాకిన అనుబూతి


44) జ్ఞాపకాల అరలలో స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా..అన్నిటీలో నీవేనా మరి నేనెక్కడ..?

45) నీకోసం ఆప్యాయంగా ఏదో రాయాలని చూస్తాను
నీ జ్ఞాపకాల అలజడికి అక్షరాలు తిరగబడుతున్నాయి ప్రియా


46) కంటతడిని గుండె అడుక్కు చేరింది..గుండె మంటను పెట్రోల్ లా మండిస్తుంది కన్నీరు

47) రాత్రి,లేదు పగలు లేదు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
నీ జ్ఞాపకాలు ఇంతేసి దిగులును మోసుకొస్తాయి నా గుండెను భారం చేస్తాయి


48) మనసు గదుల్లో బందించబడ్డ జ్ఞాపకాలకు ఆత్మహత్య చేసుకోడం చేతకాక
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గుండెలోపల నీకోసం నాపై దాడి చేసి రక్తశిక్తం చేస్తున్నాయి


49) గతకాలపు అనుభవాలలో గాలానికి చిక్కిన జ్ఞాపకాల చిక్కులు గుచ్చుకుంటున్నాయి

50)స్వప్నాలు బద్దలు అయ్యాయేమో అనుకుంటా చీకటిపొరల్లో ఏమి కనిపించడం లేదు

51) గుండెళ్ళో ఈ పేళ్ళుల్లేంటి నీవు చేసిన అవమానం
అనుబాంబులై పేలుతూ గుండెను ముక్కలు ముక్కలుగా ద్వంశం చేస్తుంది


52) మౌనం దారుణమైంది మండుతున్న లావాని సైతం
ఉండ చుట్టి తనలో దాచేసుకోని లోలోన తగలబెట్టి మాటల్ని మసిచేయగలదు


53) గొంతులో పేరుకున్న మౌనపు పూడిక తీయాలనిపించడం లేదు

54) నా గుండెను తవ్వి నిన్ను నానుంచి దూరం చేయాలని చూస్తున్నారు నీవు బైటికి రాకు ప్లీజ్

55) చావుకి బ్రతుక్కి మద్యి "మనస్నేహం" వేలాడుతుందేంటి ప్రియా

56) ఘడియ చాలు నీ గుండె చప్పుడు తెలుసుకోవటానికి
క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి


57) ప్రాణం కూడ అవసరం లేదు నువ్వు లేనప్పుడు
మరణం కూడా ఆభరణమే నువ్వు ప్రేమిస్తానన్నప్పుడు.


58) తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు,
మరి ప్రేమిస్తునానంటే వద్దని ఎందుకు వేధించావు


59) నా ప్రతి కన్నీటిబొట్టు నీ ప్రేమకి జ్ఞాపకమే,
నీ తలపులలో జీవించటం నాకు వ్యాపకమే,


60) నన్ను నేను వదలలేను,నాలో వున్నా నిన్ను మరువలేను..

61)  పరిచయాలతో పరిచయమయ్యేది స్నేహం..
ఆ స్నేహంలో లోతులను పూడ్చి పరిచయమయ్యేది ప్రేమ..
 
   


62) నాలో నాకై నన్ను నేను మనసులో ప్రేమ దాహం తీర్చడానికి నన్ను నేను తోడేసుకుంటూ

63) గుండె నిండా గాయాలతో ఏడ్చి ఏడ్చి ఎండిన కళ్ళతో ఎక్కడని వెతకను నీకోసం

64) రోదిస్తున్న నా కళ్లు మన ప్రేమ రంగులని చెరిపేసుకుంటూ
తనకు తానే రూపం కోల్పొతుంటే చూడలేక గుడ్డివాడినయ్యా ఏం చేయ్యాలో తెలీక


65) ఎన్నెన్నో కలల రంగులు ఊహలన్నీ ఊసులన్నీ ఉరి తాళ్ళై నా మెడను చుట్టేస్తున్నాయి

66) వెలుగులో దాక్కుని చీకటిలో నిన్ను వెతుక్కుంటే కనిపిస్తావా నా పిచ్చిగాని

67) ఎండకు ఎండి ..వర్షానికి తడిసి అన్నీ కోల్పోయిన ప్రేమని
ఇంకా నిజమైన ప్రేమ ఎవరో ఒకరు భిక్షంగా వేయక పోరు అని ఎదురు చూస్తున్నా


68) కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం నీతోడులేక
ఎలా చూస్తుందో చూడు ఓటమి నన్ను అపహాస్యం చేస్తూ ..అచ్చం నీలా ప్రియా

69) నీతో స్నేహం పూలతో స్నేహం అనుకోలే
కొన్నాళ్ళే పరిమళం తరువాత వాడిపోతాయి అచ్చం నీ స్నేహంలా

70) ఒరేయి నిజాన్ని కప్పి పబ్బం గడుపుకోవాలని చూడకు
ఆ నిజం నిన్ను కాల్చేసి బూడిద చేస్తుంది .. నీ అంతు చూస్తుంది

71) పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు
నీ అవమానంలో..గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో

72) ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది జ్ఞాపకం
ఇంతలా మారిపోయావు..ఇంతలా మారతావని ఊహించలేదు ప్రియా

73) ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
చల్లటిగాలికి లయబద్దకంగా చల్లటిగాలికి తలలూపుతున్నాయి

74) నా పయనంలో గమ్యం కర్మకు నన్ను బానిస చేసింది గాలి సుడిగాలయి నన్ను కమ్మేస్తుంది

75) ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానో తెలీదు
ప్రేమంటే లోకానికి అతీతమైనది అది మనుషులకు అందనిది

76) గతులే తప్పిన పయనంలో నన్ను రమ్మంటుంది మరణమే కానుకై నాదగ్గరకు వస్తోంది

77) కను పాప చాటున దాచానే నీ రూపం మనసు చప్పుడులో నీ జ్ఞాపకాన్ని దాచుకున్నా ప్రియా

78) బరువెక్కిన మనసుతో భరించలేకపోతున్నా ఒంటరి అన్న మాటకు దాస్సోహం కాలేకున్నా

79) నింగికి సొంతమైన జాబిలి నా చేతిలో ఉన్నట్లుంది
నాకోసం ఒక శ్వాసగా ఎదురుచూస్తున్నట్లు వుంది తరచి చూస్తే అంతా బ్రమని తెల్సిది

80) ఒంటరిగా ఉన్నా నాతో ఎవరో వున్నారనిపిస్తోంది,
ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయి అది నీవేనేమో అని మనస్సు హెచ్చరిస్తుంది

81) నీ మనసులో చోటుకోసం పరుగులుతీసా,
నాపేరు నీపెదవి తాకాలని ఆరాటపడ్డా ..ఎవరికోసమో అవమానించి భాదపెడుతున్నావు

82) గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు..
పొరపాటుగా చేస్తున్నావో అలవాటు గా చేస్తున్నావో అర్దంకావడం లేదు

83) కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది

84) ఎన్నెన్నో కలల రంగులు ఊహలన్నీ ఊసులన్నీ ఉరి తాళ్ళై నా మెడను చుట్టేస్తున్నాయి

85) పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు
నీ అవమానంలో..గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో