రోజులేంటి ఇంత మౌనంగా వున్నాయ్
ఏదో కోల్పోయినట్టు సూర్య చంద్రుల
వస్తున్నారు వెళుతున్నారు
తారల తళుకులు అంతంత మాత్రమే
వీచే గాలి కూడా ఏదో పలకరించి వెళ్ళిపోతోంది
నా మనసేంటి ఎంత పిలిచినా
నే రాను పొమ్మంటోంది
బహుసా నీ తీయటి పిలుపు
వినలేదని వాటికి బెంగేమో
ఆ మౌనవ్రతం ఆపి ఓమారు మాట్లాడితే నీ
సొమ్మేంపోతుందో !...
ఏదో కోల్పోయినట్టు సూర్య చంద్రుల
వస్తున్నారు వెళుతున్నారు
తారల తళుకులు అంతంత మాత్రమే
వీచే గాలి కూడా ఏదో పలకరించి వెళ్ళిపోతోంది
నా మనసేంటి ఎంత పిలిచినా
నే రాను పొమ్మంటోంది
బహుసా నీ తీయటి పిలుపు
వినలేదని వాటికి బెంగేమో
ఆ మౌనవ్రతం ఆపి ఓమారు మాట్లాడితే నీ
సొమ్మేంపోతుందో !...