అమావాస్య నిశిలో
అగుపించని చందమామలా
నువ్వూ కనిపించవేం?
నువు ఆరాధించే ఏ దేవుడూ
నేను కొలిచే ఏ దైవమూ…
నా ఈ విరహాన్ని చల్లార్చడు
కాలం గడుస్తోంది
నువ్వు కానరావు
నాకేమో ఆశ చావదు
నిత్య సంతోషంగా నువ్వున్నావు
నిన్ను నమ్ముకుని
నిత్య దు:ఖంలొ నేనున్నాను
నిద్రలన్నీ గాడతలోకి జారే
అర్ధరాత్రి అకస్మాత్తుగా గుర్తొస్తావు
దిగ్గున లేచి కూర్చుంటాను
నిశ్శబ్దమై పోవడం ఆనందం కాదు
కానీ తప్పటం లేదు
నల్లని చీకటి వెనక ఏముంటుంది?
అనంతమైన నిశ్శబ్దంలోంచి…
దూరంగా ఏదో సవ్వడి
ఎవరో తిరుగుతున్న అలికిడి
కాలికి వెండి పట్టాలు కట్టుకుని
చిరు మువ్వల అలజడితో
నా వేపే వస్తున్న భావన…
అపరాత్రి వేళ వచ్చేదెవరా అని
ఆత్రంగా చూసి తేరుకునే లోగా
కనుమరుగై పోతావు.
నిన్ను చూసిన ప్రతిసారి
సముద్రాన్ని చూసినట్లే ఉంటుంది
సముద్రం లోతు తెలియనట్లే
నీ మనసు కూడా…
నీవు నన్ను అర్దం చేసుకోలేదో
నేను నిన్ను అర్దం చేసుకోలేదో తెలీదు కాని
నేను నలిగిపోయాను ఆలోచనలతో పూర్తిగా
నలిగిన కాగితం లో అక్షరాలను చదవొచ్చు
కాని నా మదిలో
ఆలోచనలను చదలేకున్నారు ఎవరు
నీవుకూడా ఎందుకిలా మారావని అడుగను
నిన్ను అడగటానికి నాకు అర్హత ఉండాలి కదా
అగుపించని చందమామలా
నువ్వూ కనిపించవేం?
నువు ఆరాధించే ఏ దేవుడూ
నేను కొలిచే ఏ దైవమూ…
నా ఈ విరహాన్ని చల్లార్చడు
కాలం గడుస్తోంది
నువ్వు కానరావు
నాకేమో ఆశ చావదు
నిత్య సంతోషంగా నువ్వున్నావు
నిన్ను నమ్ముకుని
నిత్య దు:ఖంలొ నేనున్నాను
నిద్రలన్నీ గాడతలోకి జారే
అర్ధరాత్రి అకస్మాత్తుగా గుర్తొస్తావు
దిగ్గున లేచి కూర్చుంటాను
నిశ్శబ్దమై పోవడం ఆనందం కాదు
కానీ తప్పటం లేదు
నల్లని చీకటి వెనక ఏముంటుంది?
అనంతమైన నిశ్శబ్దంలోంచి…
దూరంగా ఏదో సవ్వడి
ఎవరో తిరుగుతున్న అలికిడి
కాలికి వెండి పట్టాలు కట్టుకుని
చిరు మువ్వల అలజడితో
నా వేపే వస్తున్న భావన…
అపరాత్రి వేళ వచ్చేదెవరా అని
ఆత్రంగా చూసి తేరుకునే లోగా
కనుమరుగై పోతావు.
నిన్ను చూసిన ప్రతిసారి
సముద్రాన్ని చూసినట్లే ఉంటుంది
సముద్రం లోతు తెలియనట్లే
నీ మనసు కూడా…
నీవు నన్ను అర్దం చేసుకోలేదో
నేను నిన్ను అర్దం చేసుకోలేదో తెలీదు కాని
నేను నలిగిపోయాను ఆలోచనలతో పూర్తిగా
నలిగిన కాగితం లో అక్షరాలను చదవొచ్చు
కాని నా మదిలో
ఆలోచనలను చదలేకున్నారు ఎవరు
నీవుకూడా ఎందుకిలా మారావని అడుగను
నిన్ను అడగటానికి నాకు అర్హత ఉండాలి కదా