. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 19, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(13)

1) ప్రేమ ఒక జ్వాల విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే


2) ప్రేమను ఎంత అర్దం చేసుకుందాం అనుకున్నా
అర్దంకాని అరబిక్ పుస్తకంలా ఎప్పటికప్పుడు గందరగోళంలా మారిపోతుందెందుకో


3) నవనాడుల్నీ నిర్వీర్యం చేసే నీ నవ్వు
విద్యుద్ఘాతమనుకుంటా నను తాకింది…

అందుకేనా నా హృదయం గాయపడింది

4) మరనించేది పుట్టడానికేనా..మరి మరనించడం దేనికి..?

5) గుండెలో మంట పెడుతూ
మాడిపోయే క్షణాన చిరుజల్లై కురిసింది కన్నీరు


6) ప్రేమ ఒక అంతు లేని రహస్యం
అది మనసును చంపగలదు...బ్రతికించగలదు


7) నీవు విషాదపు చిహ్నమై మానని గాయమైయ్యావెందుకో

8) గుండె గొంతుకలో నలిగిన భావాలు
నిశ్శబ్ద గీతాలై నన్ను వెర్రివాడిని చేసి వెక్కిరిస్తున్నాయి.


9) మనసుకి తాళం పడి నాలుక మౌనం దాల్చి
మన మద్యి మాటలన్నీ తెగిన దండలోని ముత్యాల్లా రాలిపోయాఎందుకో


10) ప్రేమ ఒక జ్వాలగా మారి విరహాల మంటల్లో
మనసును మాడ్చేసే అంతులేణి దుఖాన్ని మిగిల్చేదే ప్రేమంటే


11) వెలుగుపై చీకటి దాడి చేస్తున్న వేల
నిశీధి కలలు రెక్క విచ్చుకుంటున్నాయి..

నన్ను నిద్రపోనీయ్యకుండా చేసేందుకు

12) నీకొసం కలవర పడుతున్న మదిని తగులబెట్టాను
సమాధికింద బుట్టదాఖలై ప్రేమ పదాలు మూగగా నీకోసం రోదిస్తున్నా


13) నిన్న రాత్రి నిద్రలో రాలిన స్వప్నాలన్నీ
కన్నీరై వర్షపు చినుకులుగా మారి చిరుజల్లుల్లా కురుస్తున్నాయి


14) మనసనే గంప నిండానీ జ్ఞాపకాలే
నీవు గుర్తుకురాగానే గుచ్చుకొని మనసును రక్తసిక్తం చేస్తున్నాయి


15) ఇలా జరుగుతుందని విన్నప్పుడు నేను నమ్మలేదు.
ఒక్కొకటిగా కళ్ళముందే కదిలాడుతున్న రీళ్ళలా జరుగుతుంటే మౌనం వహించక తప్పలేదు


16) కష్టమంతా పెదవులకే..నవ్వుల నదుల్ని ఆపలేకే    

17) వర్షం వెలిసిన తర్వాత ఆకాశం అలానే ఉంటుంది..
నమ్ముతావో లేదో.. నా కళ్ళలో కన్నీళ్ళు మాత్రం అలానే ఉన్నాయి


18) కవిత అంటే కళ్ళతో ఏడవలేక 
కలం తో అక్షరాలనే కన్నీరు పెట్టడమేమో

19) కలిసి ఉన్నప్పటి మాటలు కలత పడి
ఉద్వేగపు బరువు మోయలేక మనసు భారంగా నీకోసం ఆలోచిస్తూ నేనిలా


20) ఒంటరిగా నా మనసుగదిలో 
నేను రాసుకుంటున్న పదాలు నీకెలా తెలుస్తున్నాయి ప్రియా

21) నీ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ..గతంలోకి జారిన ప్రస్తుతం
అందుకేనేమో దిగులు మబ్బులు రెండురోజులుగా కన్నీరు పెడుతున్నాయి


22) గాలిని ముక్కలుగా కోసే 
వాన చినుకులు ఏకాంతాన్ని చింద్రం చేస్తున్నాయి

23) నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన 
ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా

24) అవేశానికి ఆయుష్షు తక్కువైనా .
ఉద్వేగంలో వెలకట్టలేని అవేదన ఉందో తెలుసా..?


25) ఒంటరైన రాత్రి లో కన్నీటి సెలయేటి లో వున్ననాకు
నీకోసం నేనున్నానని ఆప్యాయంగా పిలిచే నీ పిలుపు మూగబోయింది ఎందుకో


26) నన్నల్లుకున్న బంధాలు,అను బందాలు దయలేనివి
వాటిని తెంపుకోవాలని ప్రయత్నిస్తే నా హృదయం గాయం అవుతుంది


27) అనంతమైన నిశ్శబ్దంలోంచి…దూరంగా ఏదో సవ్వడి
ఎవరో తిరుగుతున్న అలికిడి అది నీవేనేమో అని గుండెదడ ఎందుకో


28) నీలి మబ్బుల గొడుగు కింద నిదుర మత్తుని పులుముకుని
నిదురిస్తున్న నిన్ను చూడాలని మనసు పదే పదే కోరుకుంటుంది ప్రియా


29) మనిద్దరి ఙ్ఞాపకాల పుటని తిరగేస్తే ఆ క్షణమే
హృదయంలో చిరునవ్వుకు చిరుగులు పెట్టిపెట్టి గుండే భాదగా మారిపోతుంది


30) నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన
అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్...మంత్రాలు మాయలు నేర్చావే ప్రేమా


31 ) ఎందికీవేల ఈ అలజడి
ఎక్కడో ఆందోళన...వేడిగాలి ఆగి తుప్పర్లు జల్లు కురిసినట్టు..


32) పెనం మీద పడ్డ నీటిబొట్లు మాదిరి
నా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...


33) తొలకరివాన ఏ మబ్బులో మొదలైనా
మట్టిని మాత్రం ఒకేలా పలకరిస్తూ ఆమట్టిలో ఐక్యింఅయిపోతుంది


34) మదితలపుల చల్లని చినుకులు పూవుల్ని తాకుతూ
రాళ్ళను తడుపుతూ కొన్ని మెరిసే ముత్యాలవుతూ మర్చిపోని నీజ్ఞాపకాల్లా


35) తెరలు తెరలుగా పడుతూనే వున్నాయి చినుకులు...
మనసులో ప్రతిక్షనం నిన్ను గుర్తుకు తెచ్చే నీ జ్ఞాపకాల్లా


36) రమ్మని నేను పిలవలేదు... పొమ్మని నేను అనలేదు
వసంతంలా వచ్చావు..వద్దనుకొని వెల్లి తట్టుకోలేని భాద మిగిల్చావెందుకో


37) మౌనమే భాషగా ఏకాంతమే తోడుగా వెళ్ళదీస్తున్నాను కాలం..

38) తొలకరి జల్లు కురవగానే పరిమళిస్తుంది పుడమి గర్భం
నా చెలి తలపు రాగానే ఆనందంతో పులకరిస్తుంది నా చిన్ని హృదయం


39) ఓ కాలమా పొతే రావు వస్తే ఆగవు అవసరాన నిలువవు
వేదనలో కదలవు ఏ క్షణాన్ని విడువవు మరు క్షణాన్ని ఆపవు మరెందుకు నీవు


40)గుండేకు చిల్లులు చేస్తూ మనిద్దరి మద్యా నిశ్శబ్దం
రేపటి పై ఆశ లేదు ఈ నిశి రాతిరేనన్నెప్పుడో 

మింగేసి చీకట్లో కలిపేసేలాగుంది ప్రియా

41) కంటి నిండా కలలున్నాయి అవి ఎప్పటికి తీరవేమో
ఎప్పటికీ తీరందాటని ఉప్పెనలా నీవు గుర్తొచ్చిన ప్రతిసారి ఏదో తెలియని వేదన


42) ఏదో రాయాలని విఫల ప్రయత్నం చేస్తుంటా ఎందుకో
ఒక్కోసారి అక్షరాలు కనిపించకుండా కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా


43) పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ
పెదవిపై చిరునవ్వు ఉన్నట్టు ఇంకెన్నేళ్ళు నటిస్తుండాలో ప్రియా


44) ఈ రోజు నువ్వులేవు...నీ మాటలేదు....
నీ అందమైన చిరునవ్వులేదు... నన్ను ఒంటరిని చేసిన నీ జ్ఞాపకాలు తప్ప...


45) ఒక్కసారి నీ గుండెలోతుల్లొకి వెళ్ళి చూడు
నా ప్రతిజ్ఞాపకం ఒక ఆణిముత్యమై నీలో దాగివున్నదో....లేదో


46) నేహం అన్న పదంలో ..ద్వేషం ఉందా
ప్రేమ అన్నపదంలో మోసం ఉందా.. ఏంటో దీనమ్మ జీవితం


47) ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి మనో మైదానం మీద
యుద్ధాన్ని ప్రకటిస్తుంది" ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ


48) ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు
ఒకేసారి బావుర్మన్నాయి ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు అవ్యక్తమయ్యాయి


49) బగ్గుమని కాలుతున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతుల్లోకి ఇంకిపోయి మైనంలా నన్ను కరిగిపోనీ


50 ) ఇన్నాళ్ళకు మనల్ని ఓడించిన ఈ దూరం విరహమై
మోహమై కరిగి మన హద్దుల్ని కడుగుతోంది ..అడ్డంకాలన్నిటీనీ కూల్చేయని అడుగుతోంది.



51) యదలోని ప్రశాంతతను బగ్నం చేస్తూ ఏదోతెలియని వాంఛ నన్ను చంపేస్తుంది

52) 'నీ కోసమే ఒచ్చాను ' అని గొంతు తగ్గించి మాట్లాడింది
పెదవులు బిగించి.. చిలిపిగా నవ్వుతూ..మరో అడుగు ముందుకు వేసింది
మరింత చేరువగా వచ్చింది అంతే నాలో ఉన్న ఆరులీటర్ల రక్తం ఒక్కసారిగా ఎగజిమ్మింది


53) ప్రియా నువ్వటు వెళ్ళగానే నీ ఆలోచనలన్నీ
నా ముందు కుప్పగా అప్పుడే విచ్చుకుంటున్న మల్లెమొగ్గల్లా నీ జ్ఞాపకాలు తడుముతాయి


54) నా అలకలు.. నీ బుజ్జగింపులు నీ అల్లర్లు.. నా మందలింపులు
వెన్నెల్లో గోరుముద్దలు.. దిండు పక్కన సంపెంగలు ఒకరి చుట్టూ ఒకరం ..


55) నా జ్ఞాపకాలను ఖాళీ చేయాలనుకున్నావు
అందుకే మనజ్ఞాపకాలను నీమనసు చుట్టూ పెట్టి నీ ఆలోచనలతో పహారా కాస్తున్నా


56) నీవదిలేసావనుకున్న నిమిషాలన్నీ
నా మనసు పొరల్లోకి చేరి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి


57) రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని అగాథపు లోతుల్లోకి కూరకపోతున్నాగా


58) చీకటి రాత్రి నా నరాలు చిట్లగొట్టుకొని రక్త చరిత్రలు రాస్తున్నారు.

59) చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...?
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటే...?


60) ఒంటరి మనసు పదే పదే ప్రశ్నిస్తోంది...
అన్ని వేల పరిచయాలు ఏర్పడినా...ఎందుకిలా మిగిలిపోయానని .


61) అదిగో ఆనందం నన్ను చూడు ఎలా చూస్తుందొ
ఏంటో నన్ను దోషిని చూసినట్టుకరిచేలా చూస్తుంది


62) నా మనసును కొస్తూ నీ జ్ణాపకాలు కత్తులుగామారాయెందుకు
నీ జ్ఞాపకాలకు నా పై పగ పెంచుకున్నాఎందుకో అర్దంకావడంలేదు
నీవు ఆజ్ఞాపకాలను నాగుండెల్లో గుచ్చెందుకు చుర కత్తులుగా మార్చావా


63) ఏంటీ తడి చుక్కలు నా బెడ్ మీద
కలలో కన్నీరై కంటినుడి కారిన కన్నీటి జ్ఞాపకలేనా ఇవి ..?


64) మాటలన్నీ ఖాళీ అయ్యాయి మనమద్యి ఎండిన నదిలా
గుండె బిగుసకపోయింది నీమాటల శబ్దాలు చేరలేక చిలుంపట్టిన రేకుడబ్బాలా


65) హృదయంతో రహస్యఒప్పందం చేసున్నావా
బయటపడకుండా నా భావాలని ఆపమని ఆ కనురెప్పలకి ఎంత లంచం ఇచ్చావ్


66) నా గుండె శబ్దాన్ని రాసిచ్చా
నా ప్రియ సఖి కి సొత్తుగా ఎప్పటికీతనతోనే ఉండిపొమ్మని


67) ఇక్కడే ఎక్కడో ఉన్నావు..చాలా చాలా దగ్గరగా ..
కొద్దిచేపు పెరిగి కొద్దిసేపు తగ్గే గుండెచప్పుడు నీ ఆచూకి దగ్గరగా ఉందని చెబుతోంది


68) ఒయ్ అదేంటి నీకళ్ళు ఎర్రగా వున్నాయి
నీ పెదాలు అలా కదులుతుంటే నాకళ్ళలో నీళ్ళు వస్తున్నాయేంటి


69) చుక్కలా మిల మిలా మెరుస్తూ నిన్నలరించాలని
వెన్నెల్లా నీకు వెలుగైతే..జాబిల్లిలా నన్ను చేరుకుంటావని తపిస్తున్నా ప్రియా


70) అక్షర సముద్రంలో నన్ను ముంచి అందులోనుంచి మంచి ముత్యాలనేరమంటావు
అందినట్టే అంది చిక్కకుండా చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ ఊరిస్తుంటావు ప్రియా


71) అక్షరాలు కత్తులు నువ్వు దూషించినప్పుడు
అక్షరాలు మధురమైన పువ్వులు నువ్వు నన్ను ప్రేమించినపుడు


72) నన్ను వదిలి వెల్లిన నిమిషాలన్నీ
చేజారిన క్షనాలను తోడుకొచ్చి మనసు పొరల్లోకి కిజారవిడిచాయి


73) నువ్వు ఉంటే ప్రతి రాత్రి వెన్నెల రాత్రే
నువ్వు లేని పగలైనా అమవాస్య చీకటే ప్రియా


74) నీ సంగత్యంలో బాధలన్నీ మరచి పొవాలనుకున్నా…
కానీ ఆ బాధకి కారణం నీవే ఐతే నేనెవరిని ఆశ్రయించాలి మరణాన్ని తప్ప …


75) తెలియకుండా వస్తూనే వెలతానన్న విశాదాన్ని తెస్తావు,
వెలుతూ వెలుతూ మళ్ళి ఎప్పటికో అన్న విరహాన్ని రగిలిస్తావు ఎందుకో.


76) నీలొ నన్ను వెతుక్కుంటు ఒంటరైన ఈ క్షణం
నాకై ఒక్క క్షణం కూడా వెచ్చించలేని నీ ప్రేమకు నేను పిపాసిని


77) మదినిండా విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని ఎప్పటిలానే..ఆకాశంవైపు ఆత్రంగా చూస్తున్నా "జాబిల్లి" కోసం


78) విరిగి చెదిరిన ఆశల తునకల మద్యి
జ్ఞాపకాలను ఏరి తిరిగి సమ కూర్చకోలేక ..


79) కాలం జీవితంలో కాల కూట విషం చిమ్ముతోంది.
మొత్తం దేహమంతా భుగ భుగలాడుతోంది..విషం యాసిడ్ లా కాల్చేస్తుంది ప్రియా


80) ఎన్నో దినాలు క్షానాలు వచ్చి వెళ్ళాయి
నేను మాత్రం నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోయాను..ఒంటరిగా మిగిలిపోయాను