. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 29, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(15)

1) నీతో మొదలైన నా నడక..నీ గమ్యం అందక 
నడిచిన దారిని మర్చి ఎటెలుతున్నానో తెలియక 
నా కాళ్ళు శిలగా మారాయి కదలనన్ని మొరాయిస్తున్నాయి

2) మాట్లాడాలనీ ఉంది.... అందరిలా నీతో
అందరిలా నేనూ మనిషినేకదా..వారికీ నాకు తేడా ఏంటో..?


3) నరుక్కుంటున్నా..నాలో నీవు లేవన్న క్షనంనుంచి
నాలోని నన్ను....మరోసారి నీవు నన్ను గుర్తుపట్టకూడదని


4) మన జ్ఞాపకాలపై చూడు శుభ్రం చేసినా పోని రక్తపు మరకలు
నీవు అవమానంతో నన్నుపొడిచిన పోట్లు ఎలా మారాయో చూడు


5) నిద్రపోని కళ్ళతో నా రెప్పల్ని తెరిస్తే నువ్వే కనిపిస్తావు
నా కను రెప్పలునీ జ్ఞాపకాలతో నా నిద్రని వేస్తున్నాయి మరి


6) నీ లోపల ఎంత ఖాళీ వుందో నీకు తెలియడానికి,
నన్ను నింపుకొని . ..మరొకరు కనిపించే సరికి నన్ను ఒళకబోసావు


7) నాకు తెలిసిన కొద్దిపదాలతో ఏదో రాయాలని
నీ సమక్షంలో ఉన్న నా జ్ఞాపకాలను పోగుచేసుకొని రాస్తున్నా నీకోసం


8)చూపుల మాటున నన్ను కాల్చివేసిన కారనాలెన్నో మరెన్నో 
 మౌనపు చూపులలో నన్ను నేను మర్చిపోయిన మాటలు ఎన్నో

9) మనిద్దరి మద్యా మౌనం నన్ను మూగవాన్ని చేసింది
నీతో మాట్లాడాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయి మరణిస్తున్నాయి


10) కంటిరెప్పలు అదిమిపట్టి ఎన్ని కన్నీటి బిందువులను దాచుకోను
పంటి బిగువున అదిమిపట్టి గుండె రేపుతున్న మంటలను ఎన్నాళ్ళు ఓర్చుకోను


11) గుండే నిశ్శబ్దంగా నీకోసం కొట్టుకుంటోంది
మౌనం మనిద్దరిని దూరం చేసినప్పటి నుంచి


12) అక్షరాల్నీ పదాల్ని వెదుక్కుంటున్నా
గుండె స్పందనకు రూపం ఇవ్వాలని కాని మది తడబడుతోంది


13) నీ సెల్ఫోన్ లో మిస్డ్ కాల్స్ లా మిగిలిపోయిన నన్ను
ఎప్పుడో ఒకప్పుడు నీ చూపు తడుముతుంది అప్పుడు నేను గుర్తొస్తానా


14) నాలో శ్వాసవై చేరావు ఆశవై మొలకెత్తావు
ఆశమొలకెత్తగానే ముక్కలు ముక్కలు చేసి ఆనందిస్తున్నావెందుకో


15) నీ తలపుల వేడికే గుండె తట్టుకోలేక పోతోంది
మరుగుతున్న రక్తాన్ని నీకై కరిగించి కవితగా రాస్తున్నా ప్రియా


16) అంత తియ్యగా మాట్లాడావు అదినిజంకాదా
తేనెపూసిన కత్తా నీ ప్రేమ.. అదేకాబోలు నా గుండెలో దిగింది


17) ప్రానం పోయేంతగా ప్రేమిస్తే
అవమానిస్తావని తెలీదు.. నిజమే తప్పుచేశానా ...ప్లీజ్ చెప్పవూ


18) నిశ్శబ్దపు గోడల్ని శబ్ధం బద్దలు చేసినా
మనిద్దరి మౌనపు గది ఖాళీ చేయటం అంత తేలికేం కాదు


19) నీ పెదాలమీంచి విసిరిన మాట
నా గుండె మూలనెక్కడో అనుబాంబై పేలుతూనే ఉంది ప్రియా


20) అంతరాంతరాల్లో అలుపెరుగని ఆలోచనలు
ఓటమి ఒదిగి ఒదిగి చూస్తుంది.. వెర్రివాడవని నన్ను వెక్కిరిస్తుంది


21) అసలేం జరిగిందో.. అర్దం కావడం లేదు
నీ మనసు ఈ సీసా.... రెండింట్లొ ఒకే సారి ఖాళీ అయ్యాఎందుకో


22) మనసులో భావాన్ని ‘అర్థం’ చేసుకోగలిగితే కలిగే అనుభూతి అనంతం మనసులో భావాన్ని ‘అపార్థం’ చేసుకుంటే కలిగే ఎడబాటు ఓ జీవితకాలం

23) ఎన్నో భావాలను మౌనం సమాదానం చెప్పేస్తుంది.
మౌనంలో భావం అర్దం చేసుకొనే హృదయానికే తెలుస్తుంది


24) అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు,
మౌనం తో మాటల కంటే ఎక్కువే నీతో మాట్లాడానేమో అని


25) నా మౌనంలో తెలియని గుండె కోతవుంది
నీ నవ్వు చిరకాలం అలాగే ఉండాలన్న ఆకాక్షే నా ఈ మౌనం


26) నా మౌనంలో తీయ్యని బాద వుంది..బరించలేని ప్రేమతో
నీవు ఎప్పుడూ హేపీగా ఉండాలి అంతా నాస్వార్ధం అందుకే నా ఈ మౌనం


27) అంతా మౌనం వెలుగు రేకలు లేని చీకటిలా
తుఫానుముందు నిశ్శబ్ధంలా...నీ మౌనం నన్ను వేధిస్తోంది


28) రేయింబవళ్ళూ నీ ధ్యానం..నిలువెల్ల రగిలించె నీ మౌనం

29) నేస్తం ఎంత నిశ్శబ్దంగా నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెళ్ళావు నాకు తట్టు కోలేని దుక్కాన్ని మిగిల్చి


30) చాలించవా నీవింక అలుక
ఏమిచేశానని నీకింత కినుక..వీడను నిన్ను ముమ్మాటికనుక


31) ముందుకొచ్చిన మౌనంతో కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని వదలడమే సుఖమనిపిస్తుంది


32) నిశ్శబ్దం బద్దలయితే నీవిచ్చిన మౌనంలో
ఆ ముక్కలేరుకోవడమే ఒక్కోసారి సుఖమనిపిస్తుంది..


33) మౌనం వీడి నా మాటల ప్రవాహంలో,
నీ హృదయం తడిపెయ్యాలని మది కలవరపడుతోంది


34) నీ మౌనం నా మనసును గాయం చేసినప్పుడు,
శూన్యంలో మాటలు వెతకలేక, నేను మూగబోయానిప్పుడు


35) నీతోమాటలతో యుద్దం చేయలేక
నేను మౌనాన్ని ఆశ్రయించక ఏంచేయను చెప్పు


36) ధ్వని లేని మనసు ద్వారంలో
మౌనం రారమ్మని పిలిచింది పలుకలేని పదాల సాక్షిగా


37) చీకటి పొద్దులో "మది" నిశ్శబ్దంగా
సవ్వడి లేని అలజడిలో మౌనాన్నిమనసులో గుచ్చి నిద్రపోతున్నావా


38) మౌనంగా మనసులోని భావాల్ని నొక్కివేయకు
నేస్తమా దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు కదా..?


39) కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా నాలో కన్నీరై కరిగి పోతున్నావు......


40) ప్రతీ నరనరంలో మౌనం దిగ్గొట్టావు
గుండె కవాటాలు సైతం నీ మౌనంతో మూసుకపోయాయి


41) నువ్వెళ్ళిపోయాక నాలో నేను దూరం అయ్యా
మూర్తీభవించిన మౌనం నన్నావహించి నన్ను శిలను చేసింది


42)నువ్వు దూరమయ్యాక నాలో స్పందనలు
దారితెలియక మౌనంగా రోదిస్తున్నాయి నీకొసం


43) గొంతులో పేరుకున్న మౌనపు పూడిక నుంచి
బయట పడలేక "మాట" పురిట్లోనే ప్రాణం విడుస్తుంది నీకోసం.


44) మౌనం ఒక తరగని జ్ఞాపకాల ఊటబావి

45) మౌనమెంత దుర్మార్గమైనదంటే
మండుతున్న లావాని సైతం ఉండ చుట్టి తనలో దాచేసుకోగలదు.


46) మౌనమంటే నిశ్శబ్దమా..
కాదు మౌనం భయంకర విస్పోటనం


47) నా పెదాల పై అతికిన చిరునవ్వు..ఆ నవ్వుల వెనక
మండుతున్న నా గుండె కాలిన వాసన ఎవ్వరు గుర్తించలేరు


48) ఎడబాటు మంటలలో ..
మౌనం అనే అగ్నిగుండంలో..ఆత్మాహుతి చేసుకుంటున్నా


49) మౌనాల మబ్బు తెరల్ని చీల్చుకుని
భావాల్ని మాటలు గా మార్చలేక..మది మూగబోతోంది ప్రియా


50) నా కన్నుల నుండి జారిపడ్డ కన్నీరు
ఇంకా తడి ఆరక నీ పాదలపై మెరుస్తూనే ఉంది చూడు


51) నన్ను నేను మరవిపోయి 
నీకైనేను మునిగిపోయి చాలా రోజులైయింది       

52) నీకోసం నన్ను నేను ఖాలీ చేసుకున్నా
ఈ రోజుకోసం రేపటిని దాచేసుకున్నా... 

అందుకేనా మిగిల్చావు సూన్యాన్ని

53) నిశ్శబ్ధంలోంచి నాకేదో అపశ్రుతి విన్పిస్తుంది
అక్కరలేదని ఆవేదనను ఎవరొ తడిమి కొడుతున్నారు


54) కమ్మని కబురంపనా నిను చేరవస్తున్నానని
ఎదలో రేపిన అలజడిలో వెన్నెల నింపిన జాబిలితో.


55) ఏటి ఒడ్డున అడుగు జాడలు నీలో నావి
మనసు నిండా తీపి గురుతులు నాలో నీవి


56) ఎక్కడ దాక్కున్నావ్ కనిపించడం లేదు
నా మనసు కుడా చేరలేని ప్రదేశమా నేను చేరలేనా..?


57) ఆ పరిచయం జ్ఞాపకం మై గామమైంది
గాయం కన్నా జ్ఞాపకాలు ప్రతిక్షనం అలజడి చేస్తున్నాయి
 
 
 
 
 


58) రాలిన నా కన్నీటి వెల నీ నోటినుంచి వచ్చన మాటల తూటాలకే తెల్సు

59) మదిచాటున నిశ్శబ్దం మౌనం మాటున జరుగుతున్న సంభాషణ          

60) నాపై సరదా పడ్డ మరణం నా గుండెని ఉరిశిక్షవేస్తూనే ఉంది ..
నేను చచ్చిపోయాను అన్నా అది నమ్మడంలేదు అవమానపు రక్తపుటేరులు పారాలేమో


61) అబద్దానికి ఆనందమెక్కువ నిజానికి ఎప్పుడూ తట్టూకోలేని గాయలే

62) నీవు నా సమాధిపై అక్షరాలు మాట్లాడుతున్నాయి
శవంగామారినా గాని వదలక నన్ను కుళ్ళ బొడుస్తున్నాయి


63) ప్లీజ్ ఎవరైనా నన్ను నాకు వెతికి పెట్టరూ
ఒంటరి తనం నన్ను నీకు దూరంగా ఎక్కడెక్కడో విసిరేసింది


64) నీవు ఇచ్చిన ఒంటరితనం నన్ను చీకొట్టి
తన సంచిలో నన్ను వేసుకొని మూటకట్టి మురిక్కాలవలో పడేసింది


65) ఆ జ్ఞాపకంపై చూడు శుభ్రం చేసినా పోని రక్తపు మరకలు
ఎవరు అవమానంతో పొడిచారో రక్తపు ముద్దగా మారిన గుండెను అట్ట కచుకొనే వున్నాయి


66) చినిగి పోయిన మనపొరలోనుంచి తొంగిచూస్తూ
శూన్యాన్ని చూస్తూన్న మన జ్ఞాపకానికి నీమాటల సూలాలు గుచ్చుకున్నాయి


67) మనవైన కొన్ని జ్ఞాపకాలు కాంతులు కోల్పోయాయి
అనుభవాల కుదింపుల్లో నీ మనసుని గెలవలేక ఓడి అలసిపొయాయి


68) చీకటి దండెం మీద జ్ఞాపకాలు ఆరేసుకున్నాను
నీపేరుతో ఎవరెవరో వచ్చి అవమానిస్తూంటే జ్ఞాపకాలను కన్నీటితో తడిపేసుకున్నా


69) అవమానపు విస్పోటనం నుంచి
శకలాలుగా గా పడిన ఆలోచనల్ని ఏరుకుంటున్నాను


70) నా జ్ఞాపకాలు తెరలు తెరలుగా రోదిస్తూ
నాలో ఉన్న కన్నీళ్ళను ఒంపుకుని తోడేస్తున్నాయి


71) మనసనే అగ్ని గుండంలో కాలిన అక్షరాల్లాగే
నా దేహం తగలబడుతోంది కాల్చినమనిషివి నీవనే తగలబడటానికి సిద్దపడ్డా


72) వాడిదగ్గర నీవు మంచి అనిపించుకోవాలంటే
నన్ను బకరా చేయాల్సందేనా.. ఇదేనేమో స్నేహం అంటే కదా ప్రియా


73) ఇష్టపడటం అంటే..స్నేహమంటే నమ్మినవార్ని..
నాకు తెలియని మరొ మనిషి ఎదురుగా అవమానించి భాదపెట్టడమా..?


74) ఏంటో నవ్వుతూ మాట్లాడుతుంటే
భమేస్తుంది మళ్ళీ .. ఎక్కడ మళ్ళీ అవమానిస్తావేమో అని


75) కొందరి దగ్గర నిజాలను వదిలేశావు
వాటినే సాక్ష్యాలుగా చూపి..నీవే తనంటూ నిన్ను బదనాం చేస్తున్నాడు జాగ్రత్త


76) నీ పేరు చెప్పుకొని ఒక వేష్టుగాడు..నీవు తన సొంతం అంటూ
మన జ్ఞాపకాలను చెడగొట్టాలని చూశాడు అందుకే జ్ఞాపకాలను కన్నీటితో కడిగేశాగా


77) ప్రేమ శాశ్వితం కావాలంటే
నటిస్తూ అబద్దాన్ని నిజం లా చూపాలేమో కదా..?


78) మనిద్దరి మధురమైన క్షణాల గొంతు నొక్కేసి
గతాన్ని గంపలో పెట్టి ప్రస్తుతాన్ని అందరికి పంచేశావెందుకో


79) నా మనసుకు మాయమాటలు నేర్పి
మన గతాన్ని గోనెసంచుల్లో నింపి గొదాట్లో వేశావుగా..?


80) ఒంటరిగా గుండెల్లో చేరి మనసు పొరలను తాకి
నాలో జ్ఞాపకంగా మిగిలిపోయి నన్ను నాలో లేకుండా చేశావుగా


81) ప్రేమ స్లో "పాయిజన్" చావనీయదు బ్రతకనీయదు

82) కళ్ళలోని కన్నీళ్ళను కాళీచేసి
జ్ఞాపకాలతో చివరి కన్నీటి చుక్కను రాల్చేలా చేసావు


83) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తంగా నను స్వాగతిస్తావా...
నీకోసం మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా చెప్పు...


84) రాత్రి,లేదు పగలు లేదు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
నీ జ్ఞాపకాలు ఇంతేసి దిగులును మోసుకొస్తాయి నా గుండెను భారం చేస్తాయి


85) ఎండకు ఎండి ..వర్షానికి తడిసి అన్నీ కోల్పోయిన ప్రేమని
ఇంకా నిజమైన ప్రేమ ఎవరో ఒకరు భిక్షంగా వేయక పోరు అని ఎదురు చూస్తున్నా