అవును
నేను నిజాన్ని ... నిజంలాగా ఉండాలనుకుంటారు... ఎందుకో నిజంలా ఉంటే
నమ్మరు.. మసిపూసి నన్ను రూపు మార్చి అబద్దంగా చేస్తారు...అబద్దం లాంటి
అబద్దాన్నే నమ్ముతారు.. ఎందుకంటే అబద్దం అందంగా లయలు ఒలకబోస్తూ ఉంటుంది
కాబట్టీ ...నేను నిజాన్ని కాబట్టి ఉన్నడీ ఉన్నట్టుగా నిజాయితిగా ఉంటా..
కాని అబద్దం లో ఏమీ ఉండడు సూన్యిం ఏమీ లేని దాన్ని ఉన్నట్టు ఊ హల్లో పెట్టి
మోసం చేయడం.. మాటలమాయాజాలం లో అబద్దాన్ని మాత్రమే నమ్ముతారు నిజాన్ని
నమ్మరు నమ్మనీయరు నిజానికి నటించడం చేతకాదు... నటీంచాల్సి అవసరం లేదు..
అబదంలో ఏమీ లేదు కాబట్టీ నటన తియ్యటీ మాటలు ఊహలే అది వాస్తవం కాదుకాబట్టి
అబద్దాన్ని అందంగా తయారు చేస్తారు..నల్లని కాకిని సైతం కోకిల అని నమ్మేలా
చేస్తారు ...అబద్దానికి ఆనందమెక్కువ నిజానికి ఎప్పుడూ తట్టూకోలేని గాయలే
అయినా నిజం నిజమే ... ఎన్నిగాయాలైనా ఎన్ని అవమానాలు పడ్డా అది అలాని
నిఖార్సైన నిప్పులా ఉంటుంది చివరకు ప్రాణం పోయేస్థితిలో కూడా నిజాన్ని
నమ్ముకున్నవాడు కష్టాలు పడ్డా చివరి విజేత వాడే .. అబద్దంలో లోకం చాలా
అందంగా ఉంటుంది కాని చివరికి అది ప్రాణాలు తీస్తుంది అని తెల్సుకునే సరికి
ఏం మిగలదు ...నిజం అందమైన మనసున్న పడుచు పిల్లలాంటీ ది అబద్దం
వేశ్యలాంటిది... దానికి ఉచ్చనీచాలు ఉండవు ఏ ఎండకాగొడుగు పడుతుంది..