ఎదలోతులలో ఎంత ప్రేమ దాగి ఉన్నా
పెదవి మాటున అణచివేస్తున్నా
కళ్ళలో కరుణరసం పొంగిపోతున్నా
కన్నీళ్ళుగా మర్చేశానుగా
కరుడు గట్టిన కావ్యంగా మలచలేక
కనురెప్పపల మాటున బందిస్తున్నా !
నిండు పున్నమిజాబిలివనుకున్నా
అమావాశ్య చంద్రుడిగా మారిపోయావు
కరిగిపోతున్న కాలంతో పాటు పరుగులిడలేక
నిజాన్ని మింగేశిన నింగిలా
నేనెవరో నాకే తెలియనంతగా
నన్ను నేను పూర్తిగా మర్చిపోయి
అలసిపోయిన ఆశను అణిచివేస్తూ
కావించే మనస్సుని కాదనుకుంటూ
కనిపించని చీకటికి ఆహ్వానం పలుకుతున్నా !
ఆలసి సొలసిన హృదయంతో ఎదురు చూస్తున్నా
దాహం తీర్చే అమృతమయి ఉన్నా
దప్పికక తిర్చుకోలేని నిస్సహాయుడినైనా
ఓదార్పునిచే ఒడిఉన్నా
ఓదార్పు దొరకక నిట్టూస్తూ
వందేళ్ళ జీవితాన్ని వదులుకొంటున్నా ప్రియా