నీకు తెలుసా?
 నిన్న నిశి రాతిరిలో 
 నేను ఒంటరిగా ఉన్నవేళ
 నీ అలోచనలు 
 నా ఎద నిండా కమ్ముకుంటాయి
ఒక్కోసారి కవ్విస్తాయి
ఒక్కోసారి కన్నీరు పెట్టిస్తాయి
మనజ్ఞాపకాలు మాత్రం
ఎప్పుడు నన్ను గేలి చేస్తూనే ఉంటాయి
 మరలి పొమ్మని 
నీవు లేని నేను లేనని
మనసు గొడవపెడుతూనే ఉంటుంది
నీవు కావలని దూరం అయ్యావని
 ఎంత చెప్పినా మనసు వినలేదు కాని 
 ఏ ఆనందము 
 మిగిల్చని నువ్వు
 విషాదంలోనూ 
 ఆనందిస్తున్నానని 
 తెలుసుకున్నావేమో 
 ఈసారి దాని నుండి 
 కూడా నన్ను వేరు చేసావు!!
 నువ్వంతా విషాదమే తుషారమా