సూర్యోదయం లో ఉషస్సుని ,చంద్రోదయం లో వెన్నెల ని.....
వీచే గాలిలో హాయిని ....పారే గోదావరి గలగలని ...
మెరిసే చుక్కల తళుకుల ని.....కురిసే వాన జల్లుల ని......
అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని ....నాన్న పంచిన ప్రేమని ..
ఎన్నో కలలతో మరెన్నో కోరికలతో ..
అంతులేని ఆత్మాభిమానం తో ...అర్ధంకాని అమాయకత్వం తో ...
స్వచ్చమైన మనసుతో .....అచ్చతెలుగు సోయగాలతో
కొంటెగా అల్లరిచేస్తూ....కసిగా పోట్లాడేస్తూ
నవ్వుతు నవ్విస్తూ....అరుస్తూ అరిపిస్తూ
కోపంలో అలుగుతూ.....బాధలో ఓదారుస్తూ
మొండిగా వాదిస్తూ....నచ్చిందే చేస్తూ
ప్రేమను పంచే మనసుతో ...
కలగలిసిన అచ్చమైన బాపు బొమ్మ .
ప్రేమను గెలుచుకునే సహనం తో.... మన 16 అణాల తెలుగుఅమ్మాయి...?