నన్నో అక్షర సముద్రంలో
పడేసి అందులోనుంచి
మంచి ముత్యలనేరమంటావు
నేనో మంచు ముత్యాన్నంటూ
అందినట్టే అంది చిక్కకుండా
చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ
నిలవకుండా జారిపొయే పచ్చటి ఆకుపై తేలిన నీటిబొట్టులా నన్నూరిస్తూ
చేజారిపోయిన నిన్ను చేరుకోలేక
ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి
ఊహల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తావు
వద్దన్నా వడిలో తలదాల్చి
నన్ను ఊరడిస్తావు ఉలిక్కిపడి చూస్తే
అంతా చిమ్మ చీకటి ప్రియా
నన్ను నమ్మించి మోసం చెసిన
మాయావి నీవు కదా ప్రియా నీవు
పడేసి అందులోనుంచి
మంచి ముత్యలనేరమంటావు
నేనో మంచు ముత్యాన్నంటూ
అందినట్టే అంది చిక్కకుండా
చేజారిపోయిన జాబిల్లిలా నన్నుడికిస్తూ
నిలవకుండా జారిపొయే పచ్చటి ఆకుపై తేలిన నీటిబొట్టులా నన్నూరిస్తూ
చేజారిపోయిన నిన్ను చేరుకోలేక
ఉక్రోషంగా కన్నీళ్ళతో చుస్తే
చేతులనిండా బంధించలేని గాలిలా నన్ను చుట్టేసి
ఊహల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తావు
వద్దన్నా వడిలో తలదాల్చి
నన్ను ఊరడిస్తావు ఉలిక్కిపడి చూస్తే
అంతా చిమ్మ చీకటి ప్రియా
నన్ను నమ్మించి మోసం చెసిన
మాయావి నీవు కదా ప్రియా నీవు