నిశ్శబ్దం
నాకునమ్మకమయిన నా నేస్తం
నిస్సబ్డమే
నా నిజమైన బలం
నిశ్శబ్దం
నా ఆత్మ విశ్వాసం దెబ్బతీసిన అనువిస్పోటనం
నిశ్శబ్దం
నా దుక్కాన్ని పెంచే మౌనవేదన
నిశ్శబ్దం
నా జీవిత కాలమంత శాస్వితం
నిశ్శబ్దాన్ని అక్షరీకరించలేను
అదో అక్షరం కు అందని భావం
అక్షరీకరించలేని అలుపెరుగని వాస్తవం
అవమానపు అగ్నీకీలలో
కాలి బూడిదైపోయిన నిశ్శబ్దతరంగం
ఇది అంతరంగపు ఆత్మగోష..
నీవు అర్దం చేసుకోలేని ఆవేదన