నిర్మలంగా సాగే నదీ గమనంలో
నీ కదలికనే ఊహించాను
నీవిలా అవమానిస్తావని అనుకోలేదు
సెలయేటి గలగలలో
నీ నవ్వుల సవ్వడినే విన్నాను
నీవు పెట్టిన ముద్దులు గుండెలను తాకాయి
సృష్టిలో వుండే ప్రతీ వస్తువులో
నీ ప్రతిరూపాన్నే చూసాను.
కానీ......
ఈ ఆనందం కూడా తాత్కాలికమైనదని
ఆ క్షణంలో ఊహించలేకపోయాను సుమా !
తెలుసుకునే సరికి కాలం చేజారిపోయింది....
అందుకే......
నిన్నింకెప్పుడూ చూడలేనని తెలిసి
నా హృదయాన్ని ఇనుపతెరలతో
బంధించాలనుకున్నాను
అది నాకు నేను విధించుకున్న శిక్ష.....
అయినా.... అనుక్షణం
నీ ఆలోచనలూ నా మదిలో ఈదురు గాలులై
నన్ను కలవరపెడుటుంటే
నిన్ను మర్చిపోలేక నన్ను నేను ఓదార్చుకోలేక
అనుక్షణం సతమతమౌతూ బ్రతకలేక
ఆ దేవుడ్ని ప్రార్ధించేది ఒక్కటే.......
నా ఊపిరి ఆగిపోయేలోగా
ఒక్కసారి నీ చల్లని ఒడిలో
తలపెట్టి నిదురించాలి
ఆ నిద్రే శాశ్వత నిద్ర కావాలి....!!!
ఒక్క అవకాశం ఇవ్వవా ప్రియా
నీ కదలికనే ఊహించాను
నీవిలా అవమానిస్తావని అనుకోలేదు
సెలయేటి గలగలలో
నీ నవ్వుల సవ్వడినే విన్నాను
నీవు పెట్టిన ముద్దులు గుండెలను తాకాయి
సృష్టిలో వుండే ప్రతీ వస్తువులో
నీ ప్రతిరూపాన్నే చూసాను.
కానీ......
ఈ ఆనందం కూడా తాత్కాలికమైనదని
ఆ క్షణంలో ఊహించలేకపోయాను సుమా !
తెలుసుకునే సరికి కాలం చేజారిపోయింది....
అందుకే......
నిన్నింకెప్పుడూ చూడలేనని తెలిసి
నా హృదయాన్ని ఇనుపతెరలతో
బంధించాలనుకున్నాను
అది నాకు నేను విధించుకున్న శిక్ష.....
అయినా.... అనుక్షణం
నీ ఆలోచనలూ నా మదిలో ఈదురు గాలులై
నన్ను కలవరపెడుటుంటే
నిన్ను మర్చిపోలేక నన్ను నేను ఓదార్చుకోలేక
అనుక్షణం సతమతమౌతూ బ్రతకలేక
ఆ దేవుడ్ని ప్రార్ధించేది ఒక్కటే.......
నా ఊపిరి ఆగిపోయేలోగా
ఒక్కసారి నీ చల్లని ఒడిలో
తలపెట్టి నిదురించాలి
ఆ నిద్రే శాశ్వత నిద్ర కావాలి....!!!
ఒక్క అవకాశం ఇవ్వవా ప్రియా