ఎప్పుడైనా ఎక్కడైనా
వెలుగురేఖలు ప్రసరించినప్పుడు
చీకట్లో ఉన్న నేను
నా మనసుపొరల్ని విప్పుకుంటాను
ఎప్పుడైనా ఎక్కడైనా
ప్రవహించే కాంతులు ఎదురైనప్పుడు
మనస్సనే దేహాన్ని కడుక్కుంటాను ప్రియా
మనసుకు తాకిన గాయాన్ని
మనుపుకోవడానికి ప్రయత్నిస్తూంటే
మానిన గాయం..పచ్చిపుండుగా మారి
మచ్చగా మిగిలిపోయి నన్ను వెక్కిరిస్తుంది ప్రియా
నా కళ్ళు ప్రేమాక్షరాలని
అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ నేను నీకు గుర్తున్నానా మనసా
ఆ మెరుపులు ఎప్పటి కైనా చూడగలనో లేదో ప్రియా