నగరమంతా నిదురోయే
ఈ నడిరేయివేల
నీ జ్ఞాపకాలు నన్ను
పదే పదే తట్టి లేపుతున్నాయి
ఆరు బయట వీస్తున్న
చల్ల గాలులు నన్ను
నిన్ను గుర్తుచేస్తున్నాయి
మనమాటల మూటలు విప్పి
సాయం సమయాన నీవు పెట్టిన " ముద్దులు ."..
ఏలా మర్చిపోను ప్రియా
నేను భాపడుతున్న క్షనాన
ఓదారుస్తున్నప్పటికి మనజ్ఞాపకాలు
నీ తీయనిపలకరింపునే కోరుకుంటుంది!
ఎన్నటికీ నిను చేరలేనని తెలిసినా మాట వినని
నా మనసుని నువ్వైనా ఓ సారి బుజ్జగించలేవా?
సాయంవేలల్లో నీవు మాట్లాడిన ప్రతిమాట..
గుర్తుకొచ్చి గుండెళ్ళో అలజడి
ఎక్కడీకి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టుకొని
నాకోసం మాట్లాడిన క్షనాలు
కళ్ళముందునుంచి ఎవ్వరో లాక్కెలుతున్నారా,
లాకేళ్ళారా ప్రియా
రగిలే ఈ చీకటికి కరిగిపోతున్న నా జీవితంలో
నీ జ్ఞాపకాఅను మరువలేక
నా మనసు వేదన పడుతుంది నీకోసం ప్రియా