మది నిండా
నీ రూపే నిండి ఉన్నా
కనులకు నువ్వు కనబడవు
తలపంతా నీ ధ్యాసే వున్నా
నీ పిలుపు నాకు వినబడదు
ఎదుటే వున్నా ఎక్కడో వున్నట్టు
దూరాన వున్న ఎదలోనే వున్నట్టు
ఎందుకిలా అనిపిస్తుందో?
ధైర్యాన్ని కోల్పోయే తరుణాన
అప్పుడు నీ ఒక్క పలుకుతో
నా జీవితంలో వెలుగును నింపుతావు
నీ చిరునవ్వుతో నాలో
కోటి ఆశల్ని కలిగిస్తావు
నాలో వెలితిని తరిమేసే
ఆ రెండూ నీ పలుకు .. చిరునవ్వు
నాకు చేరని రోజున
నా శ్వాసే ఆగిపోయినట్టు అయింది ..
మనసు భావం వినిపించనంత దూరంగా
నా మనసు భారంగా చేసి..
అదేంటి ఇంకా బ్రతికిఉన్నావా అని అనుకుంటున్నావా
నీవు అదే కోరుకుంటున్నావని తెలుస్తూనే ఉంది
ఆరోజూ వస్తుంది పండుగ చేసుకుందువుగాని
నీ కొత్త స్నేహితులతో .. ఎదురు చూస్తూనే ఉండు ప్రియా
చుట్టూ నాకు ఎందరున్నా... నీవు లేని లోటు
నన్ను నామనస్సులో ఎప్పుడూ గుచ్చుతూనే ఉంది
ఏలా చెప్పను ఏమని చెప్పను .. వినే పరిస్తితిలో లేవు మరి