ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్యోదిలేస్తావో స్నేహమా చెలగాటమా
ఎప్పుడు నీ ముడివేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా
ఈ కలతా కాలే మమతా
మరపు రాని స్మ్రుతులలోనే రగిలి పోతావా
మరలిరాని గతముగానే మిగిలి పోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా
నిజం నిష్టూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా (ఫలిస్తే)
వెంటరమ్మంటూ తీసుకెలతావు నమ్మివస్తే నట్టడివిలో విడిచిపోతావు
జంటకమ్మంటూ ఆశ పెడతావు కలిపిఉంచే చెలిమితుంచే కలహమౌతావు
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా
చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా మరీ వేధించకే ప్రేమా (ఎందుకు)