మనం కనురెప్పలుగా మిగిలాం
ఎందుకో కనురెప్పల్లా అలా కల్సి ఇలా విడిపోతాం
ఎందుకో కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిచి ఉంచితే కనుమరుగౌతుందేమో అని భయం
లిప్త పాటులో మరణం...
ఎన్నాళ్లీదూరం
మదిలో మెదిలే భావాలకు రూపాన్నిద్దామనే ప్రయత్నం
అవమానించావు నన్ను..అవమానిస్తూనే ఉన్నావు
ఆ అదికారం నీకే ఉందిలే నేను ప్రేమిస్తూనే ఉంటాను..
నిన్ను ప్రేమించమని నేను చెప్పలేదే.?
ప్రేమించాను అన్న నీవే ...
ప్రేమను అపహాస్యిం చేస్తున్నాను అన్నావు మనసు విరిగింది అన్నావు..
నామనస్సు ఏమైందో అడిగావా మనసా..
అప్పుడు నీవు అన్న మాటలు అన్నీ అబద్దాలేని
పెట్టిన ముద్దులు బ్రమలేనా మనసా నా ప్రేమలో అర్దం మారిందా ..
నీ మనసులో నాస్థానం చలించిందా
మనసా మనసులో మరొకరు చేరినా.
మదిలో నిలచిన జ్ఞాపకాలు చేదుగా మారతాయా
అంతకుముందున్న వాళ్ళు ఏదన్న తప్పుగానే అనిపిస్తుందేమో...?
నన్ను అవమానించడం అలవాటు చేసుకున్నావు
భాదపడటం నేను అలవాటు చేసుకుంటున్నాను అశాశ్వతమైన
ఈ జీవితం అందులో ప్రేమ పరిమితం నీ స్నేహం మధురం ఈ దూరం గాయం నువ్వే నా ప్రాణం