నన్ను చూసి నవ్వుకుంటూపోతున్న నల్లని మేఘాలు
నా నా బుజాన ఉన్న సంచిలో చూడాలని
పైనుంచి ఆత్రంగా చూస్తున్న పక్షులు
మాటల మూటల్ని జాగ్రత్తగా బుజానికెత్తుకొని
వడి వడిగా అడుగులేస్తున్నా మొత్తానికి
ఎప్పటికైనా నాబ్లాగ్ చూస్తావని వచ్చా ఈ రోజు నీకోసమే
ఓ మూల కూర్చొని నీకోసం చూస్తున్నా
ఊసులన్నీ పోగేసి వుంచు. ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.
అని అన్నావు కదా అందుకే నీకోసం ఎదురు చూపులు ఇక్కడ
ఎందుకున్నానో తెల్సా.. నీకు కవితలంటే ఇష్టం కదా..
ఎప్పటికైనా ఇక్కడికొస్తావనే ఆశతో చూస్తున్నా..
అదికో నడుచుకుంటూ వస్తున్నది నీవేనా.. ?
ఏంటి కళ్ళు మసకబారాయి.. ప్రియా నీవేంటీ నీటిలో నడుస్తున్నావు.
ఆ వస్తున్నది నీవేనా.. ఇప్పటిదాకా స్పష్టంగా చూసిన నేను
ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు ఎందుకో..
నీవు వస్తున్నా వన్న ఆనందంలో
నాకళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక కన్నీళ్ళతో నిండి ఎవ్వరు వస్తున్నది కనిపించడంలేదు ..
అదేంటి ఆగకుండా వెలుతున్నావు అది నీవుకాదా..
ఏంటో నా కన్నీటి పొర నీవెవరో చూడనీకుండా చేస్తోంది..
అరె..వెళ్ళీపోతున్నావా.. వచ్చిందినీవుకాదా....?