ఈ రోజు ఆరంజ్
సినిమా పాటలు వింటుంటే
నీవే గుర్తుకు వచ్చావు ..
పచ్చని ప్రకృతిసాక్షిగా
మనిద్దరం కార్లో వెలుతున్నప్పుడు
"..నీవు నాతో మాట్లాడుతుంటే
ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం
నీవు నా వైపు చూస్తే
మనసు లోకమై విహరిస్తుంది
సముద్రమై నిన్ను స్పృశిస్తుంది
నువ్వు నా భుజంపై వాలిపోతే
అనంతపు జీవితాన్ని మోసినట్టుగా
హృదయం దూది పింజెలా మారిపోతుంది
ఏదో ఒక సమయంలో
నీకోసం నిరీక్షించేలా చేసే నీ వాలు చూపు
నన్ను వివశుడిని చేస్తుంది
గుండెల్లో ప్రేమ విత్తనం నాటుతుంది
నాకోసమే నీవు పుట్టావేమొ అనిపిస్తుంది
అవును ..నీ మీద నేను వాలిపోయి
చందమామను చూస్తూ ..
పుడమి వెన్నెలను
చేతుల్లోకి తీసుకుని ...
నిన్ను ముద్దాడాలని ఆవేశపడే వాన్ని
నువ్వు ..నేను ఒకే నాదమై
ప్రేమ వర్షంలో తడిసి పోయినట్టు
కల నన్ను కుదిపేస్తోంది
అవును .. నిన్నటి దాకా
నేను మనిషిగా ప్రయాణం చేశా
కానీ ..నీతో స్నేహం కలిగాకా
ప్రేమైక జీవిగా మారిపోయా .."
మరిప్పుడు నేనుఎందుకు ఒంటరిగా మిగిలిపోయా
ఆశాడిష్టుగాడిని నమ్మావు
మరినేనేం తప్పుచేశాను నటింఛడం చేతకాకపోతే
మనసును ఏమార్చలేకపోతే ఇలా మిగిలి పోవాల్సిందేనా
సినిమా పాటలు వింటుంటే
నీవే గుర్తుకు వచ్చావు ..
పచ్చని ప్రకృతిసాక్షిగా
మనిద్దరం కార్లో వెలుతున్నప్పుడు
"..నీవు నాతో మాట్లాడుతుంటే
ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం
నీవు నా వైపు చూస్తే
మనసు లోకమై విహరిస్తుంది
సముద్రమై నిన్ను స్పృశిస్తుంది
నువ్వు నా భుజంపై వాలిపోతే
అనంతపు జీవితాన్ని మోసినట్టుగా
హృదయం దూది పింజెలా మారిపోతుంది
ఏదో ఒక సమయంలో
నీకోసం నిరీక్షించేలా చేసే నీ వాలు చూపు
నన్ను వివశుడిని చేస్తుంది
గుండెల్లో ప్రేమ విత్తనం నాటుతుంది
నాకోసమే నీవు పుట్టావేమొ అనిపిస్తుంది
అవును ..నీ మీద నేను వాలిపోయి
చందమామను చూస్తూ ..
పుడమి వెన్నెలను
చేతుల్లోకి తీసుకుని ...
నిన్ను ముద్దాడాలని ఆవేశపడే వాన్ని
నువ్వు ..నేను ఒకే నాదమై
ప్రేమ వర్షంలో తడిసి పోయినట్టు
కల నన్ను కుదిపేస్తోంది
అవును .. నిన్నటి దాకా
నేను మనిషిగా ప్రయాణం చేశా
కానీ ..నీతో స్నేహం కలిగాకా
ప్రేమైక జీవిగా మారిపోయా .."
మరిప్పుడు నేనుఎందుకు ఒంటరిగా మిగిలిపోయా
ఆశాడిష్టుగాడిని నమ్మావు
మరినేనేం తప్పుచేశాను నటింఛడం చేతకాకపోతే
మనసును ఏమార్చలేకపోతే ఇలా మిగిలి పోవాల్సిందేనా