ఎవరు నీవు.....
నాకు ఏమవుతావు.....
నన్నెందుకు ఇలా....వేధిస్తావు
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు...
ఒక్కోసారి నీ మాటలతో నన్ను నామనస్సును
పెద్ద పెద్ద గాయాలు అయ్యేలా చేశావు
నీకది ఆనందమా.. ఎందుకలా మారావు
అప్పుడు అలా లేవే.. ఇంతలో ఇంత మార్పా
కొందరి పరిచయంలో నేను ఇప్పుడు వేష్టుగా
వాళ్ళతో పోల్చి నన్ను అవమానిస్తున్న నిన్నే
చూస్తున్నా ఎమనాలో తెలీక
అభిమానించినందుకు అవమానించాలా
వాడు హేపీగా ఉండాలంటే నన్ను వేదించాలా ప్రియా
ఎందుకలా నేనూ మనిషినే కదా
ఒకప్పుడు నేనెక్కడ భాదపడతానో అని ఫీల్ అయ్యావు
ఇప్పుడు ఏదో విదంగా భాదపెడుతున్నావు...నీవు చాలా గ్రేట్
నీకు ఏదైనా సాద్యి అని నిరూపిస్తున్నావు ప్రియా