మనసా ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను
ఈ క్షణం ఇలా ఆగి పోనీ..నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని మసక వెలుతురే నీకై తపించిన
నా నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులుఎన్నాళ్ళో ఎన్నేళ్ళో తెలీదు మనసా
గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
క్షనం క్షనం నేను కాలిపోతున్నా నీ ఆలోచనలతో
నన్నే నేను పోగొట్టుకున్నా మనసా.
సాయంత్రాలు నీజ్ఞాపకాలను మనస్సులో వెతుక్కుంటున్నా మనసా
నన్నే నేను ఏమార్చనీ మనసా
నేనంటూ మిగిలుండాలన్న నీ జ్ఞాపకాల నీడల్లో
అనుక్షణం నీకై పరితపిస్తున్నాను మనసా
ఎందుకింత కాంక్ష ..ఎన్ని సార్లు మానసునడిగినా సమాదానం లేదు
మనసా జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి
కానీ ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ మనసా,
నా చివరికోరిక నీవే ఎప్పుడూ గెలవాని నేనోడినా పర్లేదు
నీగెలుపు నాకు ముక్ష్యిం నేనైమైనా పర్లేదు మనసా