ఊహిచకుండా వాస్తవమై తనొచ్చింది
ఎర్రటి ఎండలో చిరుజల్లులా
వేడి నిట్టూర్పులమద్యి
వేదించే జ్ఞాపకాలతో ఉన్న నన్ను
గుండె సిదిలమై శిల్పంగా మారిన క్షనాన
నన్నో బొమ్మగా మార్చి
అబొమ్మకు అందమైన బావాలు కూర్చి
శిల్పాన్ని బొమ్నను చేసి
ఆబొమ్మకు ఆశలు రేపి
స్నేమనే ఊపితో
ప్రేమనే ఆయువుని ఇచ్చి
యిక ఎప్పటిలాగే చికటే తోడైయ్యింది
చెత్తైన మనస్సు మూగగా రోదిస్తుంది
అలవాటుగా ...చేయని పొరపాటుకు
మళ్ళీ జీవం ఉన్న శిల్పంగా మారిన బొమ్మ
ఆ బొమ్మతో
ఆడుకున్నంత సేపుఆడుకుని
అరలో నన్ను విసిరేసి
ఎప్పటిలాగే, అలాగే
అందరిలాగే నిర్దయగా
నన్నొదిలి
తను వెళ్లిపోయింది
గూటిలో ఒంటరిగా ఉన్న బొమ్మకి
భయం .... వేస్తే
దిగులు ... వేస్తే
బెంగగా .. ఉంటె
ఆ బొమ్మకు నీవే గుర్తుకొస్తుంటే
ఏం చేయాలి, ఎవరికి
ఏమని చెప్పుకోవాలి ప్రియా
ఆబొమ్మను అక్కడికక్కడే తగలబెట్టి ఉంటే
ఇన్ని భయాలు భాదలు కష్టాలు కన్నీల్లు ఉండేవి కాదేమో ప్రియా