గతం గుర్తుకొచ్చి తడుముతోంది మనస్సు నీకోసం
జ్ఞాపకం గాయంఅయింది మరి... కోసం
ఎవ్వరన్న అందంగా నవ్వినా
ఆప్యాయంగా మాట్లాడినా నీవేమో అని ఆత్రంగా
నాకళ్ళు నీకోసం వెతుకుతాయి...
నా మనసు తొంగి తొంగి చూస్తుంది నువ్వేనేమో అని
ఆతర్వాత అది నీవుకాదని తెల్సి
మనస్సు మూగగా రోదిస్తుంది
అప్పుడెప్పుడో నీవు ఆప్యాయంగా మాట్లాడిన
మాటలు గుర్తుకొచ్చి..కలల్లో చిన్నపిల్లాడిలా
కలల్లో నీవు కనిపించాక చూడాలిమనస్సుసంబరం
స్కూలు కి వెళ్లనని మారము చేసే
చంటి పిల్లాడికి సెలవలు ఇస్తే సంబరపడే అంతగా ...
ఆనందిస్తుంది పాపం అది శాశ్వితం కాదని తనకేం తెల్సు
ఎందుకో నా మనస్సుకు నువ్వంటే అంత పిచ్చి
కలలో నీ మాటల సెలయేరుల నా ముందు ప్రవహిస్తావు
నేను మౌనపు పడవనై
నీ అలలలో తేలియాడుతూ ఊయాలుగుతాను.
నువ్వు చూపుల బాణాలు వేస్తూ... ఉంటావు
ఆ బాణాలు చేసే గాయాలను నీకు చూపలేక
సిగ్గుల మొగ్గనై విరబుస్తూ ఉంటాను
గంటలు క్షణాలల కరుగుతూ ఉంటాయి
జాబిలి వస్తుంది వెన్నెల విరుస్తుంది
నువ్వెళ్ళే గడియ కూడా వచ్చేస్తుంది
ఆ చల్లని రాతిరిలో నన్ను ఒంటరిని చేసి
ఎంతో విరహాన్ని మిగిల్చి
నీ దారిన నువ్వు వెళ్లి పోతావ్...
తిరిగి రేపటి సంద్యకై నీ రాకకై
నా ఎదురుచూపులు మాత్రం తప్పవు కదా....
అది నిజంకాదని తెల్సినా .. మరురాత్రి
గుర్తొచ్చి ఏడిపించిన జ్ఞాపకాలు ..
గుర్తుగా కన్నీటి చారకలుఎతెల్లవారుజామునో కాస్త కునుకు పట్టగానే ..
నిజమనుకునే లాంటీ ఊహల కలల ఊయలలు
గతం గాయమై.. నిజం కలగామారి..
కారణం తెలీయని కఫ్యూజన్ లో
ఏమౌతుందో తెలీక ...ఎవమవ్వాలో అర్దంకాక..
గజిబిగి గందరగోళం ప్రియా