ఎక్కడ నిన్ను మరుస్తానో అని
నిన్నూ నీజ్ఞాపకాలను
నా గుండె లయలో ,
ఎక్కడ కనిపించకుండా పోతావో అని
నా శ్వాసలో బంధించేసాను ప్రియా నిన్ను .
ఈ అడ్డంకులు అన్నిటిని తోసేస్తూ...
నిన్ను చేరుకోవాలని...
నిరంతర మర్గాన్వేశినై నేనుంటే...
మరి,
ఈ చేదునిజమేంటి
స్వప్నమై నిలిచింది...!
నా శ్వాస ,నా గుండె లయ
ఎప్పటికి....నావి కావా....?!!
కాలేవా.....??!
మరి దేనికోసమో నా ఆరాటం తెలియక
నడిరాతిరి మొదలైన కన్నీటి జల్లు
తెలవారే దాకా.... కురుస్తూనే ఉంటుంది.
చివరిగా..రెండు కన్నీటి బొట్లు
"ఎందుకే తనకోసం తాపత్రయపడి
మమ్మల్ని చేజార్చుకొంటావు...?" అంటూ...
నేలరాలాయి....నిన్ను తలచుకొంటూ
ఎప్పటికి...జవాబు లేని ప్రశ్న
నాలాగే....కాని
కొత్తప్రపంచంలో నీవుచేసిన చాటింగ్ హిష్టరీ
నీ పోష్టులు చూశాక మనసు చేజారిపోయింది లే
నీజోలికి రావద్దని నిర్నయించుకున్నా లే ప్రియా