వేల ఆశలతో విచ్చుకుంది ఓ పుష్పం ..
తన పరిమళ అందాలతో ,
నీ మదిని మైమరిపించాలని..
నిర్మలమైన మన ప్రేమకి గుర్తుగా నిలవాలని,
మదిలోని భావాలకి వారధిగా ఉండాలని..
వాడిపోయే లోపే వలచిన హృదయంలో ,
శాశ్వతంగా నీలో ఒదిగిపోవాలని..
విప్పారిన పూరేకులతో,
వర్ణమయ ఈ జగతిని చూస్తూ..
తనదేలే అదృష్టమనుకునే క్షణంలోనే ,
చురుక్కున గుచ్చుకుందొక ముల్లు..
నా చిన్ని గుండెకు పెద్దగాయం చేస్తూ
తన ఆశలన్నింటినీ వెక్కిరిస్తూ..
నాకు ఒంతరితనాన్ని శాశ్వితంగా గుండెల్లో గుచ్చి
నన్ను కాదని వెళ్ళీంది వస్తుందన్నా ఆశ ఉన్నా
అప్పటికి నా ఊపిరి ఉడాలి కదా ప్రియా
పుట్టేటప్పుడు ఎన్ని ఆశలో,
గిట్టేటప్పుడూ అన్ని ఆశలే..
ఏ ఒక్కటీ తీరలేదని తీవ్ర నిరాశలు
పుట్టేదాక ఎన్ని బాధలో
చచ్చేదాకా అన్నీ వ్యధలే..
చుట్టు ముట్టినవన్నీ ముళ్ళ పొదలే
జీవచ్చవంలా పడి ఉన్నా
ప్రియా నీకోసం ఎదురు చూస్తూ