మనసులోని మాటలన్నీ కమ్మని తెమ్మెరగా నన్నూ
నా ఆలోచనలనీ వెతికి వెతికి కమ్ముకున్నాయి
చిరు చీకట్లలో చిటికెడంత ముద్దు నన్ను తాకిందని
నేను తేరుకునే లోగా నీ నవ్వుల వాన, నీ మాటల
నీ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి ఇంతలో
నన్ను ఓ వరం మెరుపులా తాకింది నీ చారెడు కళ్ళు
నన్ను వెనకనుంచి జ్ఞాపకాల వలతో పట్టేసాయి
ఎందుకు నీ ఆలొచన నన్ను ఇలా తరుముతోది
నిన్న నే చూసిన కలా? లేక ఈరొజు నాకు అందిన
అందమైన సహసంభాషణ సహచర్యమా
నాలో ఏమిటీ మార్పు నీవేఅంతా అనే ఆలోచన
మనసులో మాటలో పదములో పెదవులో
అడుగడులో మరీ మరీ నీ ఆలొచన ఎమీ
రేపు నీ సుందర రూపం ఎలా చూడను?
నా నిద్రను కాజేయమని నా కలను జయించమని
మనసులో మధురంగా ఉన్న నీరూపం నాతోనే
అనుకుంటూ నిద్రను కోరనా, కలను రమ్మననా ప్రియా