ప్రియా ఎడబాటుల వేడిమిలో
ఎన్నాళ్ళీ నిరీక్షణ,
విరహతాపం చల్లారక
నా మది అనుక్షణం
నిన్నే తపించేనా,
జాము రాతిరి
జాబిలమ్మపై విరహాల చీకటితో,
నీ రూపమే చిత్రిస్తున్నా,
నువ్వు నాకు దక్కవని తెలిసినా,
కల్లోల కడలినై
ప్రతి క్షణం
నీ పేరే స్మరిస్తున్నా చెలీ..
నీ ప్రేమ సంద్రంలో నా మనసు నావపై
నీ జ్ఞాపకాల అలలను దాటుకుంటూ వెళ్తున్నా,
ప్రియా నువ్వు లేని తీరానికి ప్రేమలేని మరో ప్రపంచానికి.....
ఎన్నాళ్ళీ నిరీక్షణ,
విరహతాపం చల్లారక
నా మది అనుక్షణం
నిన్నే తపించేనా,
జాము రాతిరి
జాబిలమ్మపై విరహాల చీకటితో,
నీ రూపమే చిత్రిస్తున్నా,
నువ్వు నాకు దక్కవని తెలిసినా,
కల్లోల కడలినై
ప్రతి క్షణం
నీ పేరే స్మరిస్తున్నా చెలీ..
నీ ప్రేమ సంద్రంలో నా మనసు నావపై
నీ జ్ఞాపకాల అలలను దాటుకుంటూ వెళ్తున్నా,
ప్రియా నువ్వు లేని తీరానికి ప్రేమలేని మరో ప్రపంచానికి.....