ఎం మనుషులో , వీళ్ళస్సలు అర్దం కారు బ్రతికున్నప్పుడు చంపేసి చచ్చాక ఏడుస్తారు. చితి పై పండ బెట్టాక నాజ్ఞపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయేమో అందరి కళ్ళలో కన్నీరు జల జల రాలుతుంది
నేను చితిమంటల ల పై తగలబడుతున్నాక ఎందుకో కొందరు ఒక్కపెట్టున ఏడుస్తున్నారు వీళ్ళే ఒకప్పుడు నన్ను గుండెలవిసేలా చేశారు నేను చచ్చిపోవడానికికారణం వీళ్ళే మరిప్పుడేం ఇలా గుండెలవిసేలే ఏడుస్తున్నారు
కొందరికి నేనేవరో తెలిని మనుషులు వాళ్ళే సొంతగా పరిచయం చేసుకున్నారు నా ఏడ్పేదో ఏడుస్తుంటే..ఓదార్పులా వచ్చి తనకొసం ఏచేలా చేశారు మనసు మారింది మనిషి మారింది ఎవరికోసమో నన్నోడించి ఏడ్పించడం మొదలు పెట్టింది
ఎవడో పక్కన చేరి వాన్ని పొగుడుతూ నన్ను తిడుతూ వెటకారపు మాటలు వాడు రెచ్చిపోయి అన్న పదాలతో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు వాడి మాటలు నా మెడ నరాలు కసుక్కున కొరికినంత భాద
వాన్ని ప్రేమగా పిలుస్తూ నన్ను వెటకారపు మాటలతో వేదించావు అప్పుడు నీవు నా గుండె మీద దాడి చేసి నరాలు తెగ్గోసినంత భాద,,రక్తం పీల్చి పిప్పి చేస్తున్నంత ఆవేదన
నీ వన్న ప్రతి మాటకు ఒక్కో గుండె నరం తెగిపోయింది రక్తం జల జలా రాలింది..రక్తం ఏరులై పారింది ఐనా నేను మౌనంగానే ఉన్నా మౌనంగానే నా ప్రాణాని వదిలా
ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఉన్న నీవే ఇప్పుడు శత్రువులా నన్నేడిపించి చంపేశావు నిన్ను ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన తప్పేమో అందుకే ఆప్రాణం తీసే హక్కు నీదే అని అనుకున్నావేమో ఆ హక్కుతోనే నన్నిలా వేదించి చంపావేమో
ఇంతా చేసి ఇప్పుందుకు ఆకన్నీరు నిజంగా ఏడుస్తున్నావా ,,అందరూ చూస్తున్నారని నటిస్తున్నావా నాకెందుకో నీవు కన్నీరులా లేవు .. నా పిడా విరగడైందని వస్తున్న ఆనంద భాష్పాల్లా ఉన్నాయి
ఇంకా ఎందుకురా నటిస్తావు నీజం ఒప్పుకోరా...ఇప్పటికైనా ప్లీజ్ నటించకు అదిగో నీ వాళ్ళు వచ్చారు వెళ్ళు వాళ్ళాకోసమేగా నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు వెళ్ళు వాళ్ళేకదా నీకు ముఖ్యిం వెళ్ళరా ఇంకా ఎందుకు ఏడ్చినట్టు నటిస్తావు
ఓయ్ నామాట నీకు వినిపిస్తుందా నా ఆవేదన నీకు అర్దం అతుందా చితిమీద ఉన్నా నీగురించే ఆలోచనలు నీకోసంగతి తెల్సా .. నాతో పాటూ నీజ్ఞాపకాలను తీసుకెలుతున్నా
ఒయ్ ఎక్కడికి వెళ్ళీపోతున్నావా ఒక్కసారి నావైపు చూడవా వాళ్ళోచ్చారు వాళ్ళతో నీవెళ్ళీపోతున్నావేంటీ నేనింకా పూర్తిగా తగలబడలేదు అప్పుడే నీ స్నేహితులతో వెళ్ళీపోతున్నావా ఇప్పటిదాక నేనన్నవన్నీ నిజాలేనా నామీద కోంచేంకూడా ప్రేమలేదా ప్లిజ్ నేను పూర్తిగా కాలిపోయేదాకా అన్నా నటించవా..ప్రియా ఇది నా హృదయ వేదన ప్రియా