మనసులోతు లో ఎగసిన కెరటం
అక్షరాలను దిద్దుతోంది అందంగా
నీవు మదికి చేసిన గాయాన్ని
సున్నితంగా తుడిచేయాలని అప్రయత్నంగా.....!!
ఆ కెరటానికి తెలుసా పాపం... ??
ఆ అక్షరాల కి రూపమై
ప్రాణం పోసింది నీవేనని.....!
కన్నీటిని కన్పించనిస్తే ఎక్కడ జారిపోతావేమో
అన్న భయం తో శాస్వతం గా అక్షరాలని చేసానని .......!
అలలై ఎగసిపడుతున్న కన్నీటిని
బయటకి రానీక ఇలా అక్షరాలను చేస్తున్నానని .......!
తెలుసుకొని నిన్ను తప్ప వేరేది ఉంచగలదా?
కనీసం ఊహించగలదా ?
నేనే ఊహించలేను....
ఇక అదెలా చేస్తుంది
అందుకే,
నీ విలువ తెలియచెప్పిన నన్ను కుడా
కాదని నిన్నే అనుభవిస్తోంది ప్రియా....!!
ప్రతి అక్షరాన్ని వాక్యాలుగా కూర్చుకుంటూ
వాక్యాలన్నీ కథలుగా మార్చుకుంటూ
కథలన్నీమన అనుభూతులై అల్లుకుంటూ
నీ జ్ఞాపకాల కావ్యం తో మదిని నింపేస్తోందా కెరటం......!!
--సీత