ప్రియా తలపులు నిన్నే తలచుతు వున్నా,
పలుకులు నిన్నే పిలుచుతు వున్నా,
పెదవుల మాటున మాటలు దాచి,
రెప్పల మాటున నీటిని దాచి,
నిను మరువక, నిదుర ఎరుకక,
నిర్వీర్యుడినై నిలచివున్నా!
పరువం ప్రాయం దాటుతు వున్నా!
కాలం కదులుతు కరుగుతు వున్నా!
నిజం నిప్పులా నను కాల్చుతు వున్నా!
కన్నీటి కొలనులో జలకాలాడుతున్నా!
హ్రుదయాగ్నితో నాట్యమాడుతున్నా!
మౌనరాగం ఆలపిస్తూ ఎదురుచూస్తున్నా...!
నీ మనసు పై మన జ్ఞాపకాలు,
ప్రేమ పుష్పాలను మరల పూయిస్తాయని ఆశిస్తూ...
నీ కోసం, నీ పిలుపు కోసం
ఎల్లపుడూ ఎదురు చూసే.
పలుకులు నిన్నే పిలుచుతు వున్నా,
పెదవుల మాటున మాటలు దాచి,
రెప్పల మాటున నీటిని దాచి,
నిను మరువక, నిదుర ఎరుకక,
నిర్వీర్యుడినై నిలచివున్నా!
పరువం ప్రాయం దాటుతు వున్నా!
కాలం కదులుతు కరుగుతు వున్నా!
నిజం నిప్పులా నను కాల్చుతు వున్నా!
కన్నీటి కొలనులో జలకాలాడుతున్నా!
హ్రుదయాగ్నితో నాట్యమాడుతున్నా!
మౌనరాగం ఆలపిస్తూ ఎదురుచూస్తున్నా...!
నీ మనసు పై మన జ్ఞాపకాలు,
ప్రేమ పుష్పాలను మరల పూయిస్తాయని ఆశిస్తూ...
నీ కోసం, నీ పిలుపు కోసం
ఎల్లపుడూ ఎదురు చూసే.