1) నీవులేని
నాజీవితం సంగీతం పలుకని వీణతో సమానం నాతో ఉంటూ రాగాల్ని పలికిస్తావో
దూరంగా వెళ్ళి మౌనాన్ని మిగిలిస్తావో…..నిర్ణయం నీదే ప్రియా
2) ఆశ నిరాశ ల నడుమ నీవు లేక నా జీవితం చీకటి మయం అయ్యింది నా చితి మంటల వెలుగులైనా ఈ చీకట్లు తొలుగుతాయేమో ప్రియా..
3) అను క్షణం నీ నామాన్నే వినిపించే నా హృదయం..నీవు లేని ఈ వేళ మరణ మృదంగాన్ని వినిపిస్తుంది
4) కరిగి పోయేకాలానికి చెరగిపోయిన గతానికి మిగిలిపోయే ఒకే ఒక తీయనిజ్ఞాపకం నీతో నా స్నేహం.
5) మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూ మాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూ ఇంకా ఎంతకాలమిలా
6) మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక..పిచ్చెక్కుతోందినాకు మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా
7) నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం...అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.
8) నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు
9) ఎందరిలో నేనున్నా, నా నాజ్ఞాపకాలు నీకు అంకితం.నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం
10) మనసు నీదిగా ఇచ్చేశాను ఎందుకంటే అనుక్షణం అది నిన్నే కోరుకుంటుంది
11) ప్రేమ పెదాలు పలికే పదాలు కాదు.. ప్రేమంటే పెదాలు సైతం పలకలేని భావాలూ
12) నీవు మౌనం వహించనప్పటినుంచి నా మతి చలించింది ..ఏప్పుడో ఒకప్పుడు ఏదో క్షనంలో కుప్పకూలిన మట్టిమిద్దెనౌతానేమో మనసా
13) అనంతాన్నీ ప్రశ్నించినా సమాధానం నువ్వే వచ్చినప్పుడూ పిచ్చిగా నీగురించి ఆలోచిస్తూ..ఆవేశపడిపోతుంటాను మనసా.
14) నా గుండెలపై నువ్వు సేద తీరాలని...నా ఆశలను నువ్వే నింపుతూ ఉండాలని
15 ) నా అడుగులతో నిన్ను కలుపుకొవాలని..నిరంతరమూ నా గుండే తపిస్తూవుంటుంది.